అల్లుడికి లవ్‌లీ హీరోయిన్‌ను సెట్ చేసిన నాగార్జున
తన మేనల్లుడు సుశాంత్ కోసం... లవ్‌లీ హీరోయిన్ శాన్విని సెట్ చేశాడు అక్కినేని నాగార్జున. ఇప్పటి వరకు కెరీర్లో సరైన హిట్ లేని సుశాంత్‌ను హీరోగా నిలబెట్టడమే లక్ష్యంగా చేసుకున్న నాగార్జున..... సుశాంత్, శాన్వి జంటగా ఓ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఈ చిత్రం ద్వారా సాయిరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.
సాయిరెడ్డి చెప్పిన కథ నాగ్‌ను బాగా ఇంప్రెస్ చేయడంతో తన సొంత బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అయ్యారు. జూన్ నెలలో ఈచిత్రం ప్రారంభం కానుంది. క్యూట్‌గా కనిపించడంతో పాటు.... నటన పరంగానూ మంచి పెర్ఫార్మెస్స్ ఇవ్వడంతో నాగార్జున కళ్లు శాన్విపై పడ్డాయి.
ఆ మధ్య సుశాంత్ దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి రూపొందించే ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తాడని వార్తలు వినిపించినప్పటికీ.... ఇప్పటికే ప్లాపుల్లో ఉన్న సుశాంత్ ఆ ధైర్యం చేయలేక సేఫ్ రూట్లో కమర్షియల్ చిత్రాల వైపు మొగ్గు చూపి ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.
సాయిరెడ్డి దర్శకత్వంలో రూపొందబోయే చిత్రం పూర్తిగా సుశాంత్ బాడీ లాంగ్వేజ్‌కి తగిన విధంగా ఉంటుందని, లవ్‌లీ శాన్వినీ ఈచిత్రంలో మరింత లవ్‌లీగా చూపిస్తారని, ఎక్స్ ఫోజింగ్ విషయంలో కూడా ఆమెపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారని సమాచారం. మరి ఈచిత్రంతోనైనా సుశాంత్ దశ తిరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











