పవన్ కల్యాణ్ స్నేహితుడిని ఇబ్బంది పెడుతున్నాడా?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన స్నేహితుడు శరత్ మరార్ నిర్మాతగా 'గబ్బర్ సింగ్-2' చిత్రం ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. సంతప్ నంది ఈ చిత్రానికి దర్శకుడు. పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే మామూలు విషయం కాదు. కోట్ల రూపాయలతో వ్యవహారం. పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్-2' చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే డబ్బుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు మొదలు పెట్టారనట శరత్ మరార్.
పవన్ కళ్యాణ్‌కి ఎప్పుడు మూడోస్తుందో తెలియదు కాబట్టి సినిమా కోసం ముందస్తుగా భారీ మొత్తంలో డబ్బు ఏర్పాటు చేసి పెట్టుకున్నాడట శరత్ మరార్. వాస్తవానికి ఈ చిత్రం గత సంవత్సరమే మొదలవ్వాల్సి ఉండగా కేవలం పవన్ కళ్యాణ్ చేస్తున్న జాప్యం వల్లనే ఇప్పటికీ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. దీంతో భారీగా డబ్బు ఏర్పాట్లు చేసుకున్న శరత్ మరార్ ఇబ్బంది పడుతున్నాడని ఫిల్మ్ నగర్లో చర్చసాగుతోంది.

సురేష్ ప్రొడక్షన్స్ అండ్ శరత్ మరార్ జాయింట్ వెంచర్ గా తెరకెక్కుతున్న గబ్బర్ సింగ్2 మూవీ కోసం శరత్ మరార్ కొంత మనీను ఇంట్రెస్ట్ గా తీసుకువచ్చాడంట. అయితే ఈ మూవీ ఎంతకీ స్టార్ట్ కాకపోవడంతో శరత్ మరాత్ తెచ్చుకున్న మనీ అంతా ఇంట్రస్టు రూపంలో కరిగిపోతుందని అంటున్నారు.
ఇన్నాళ్లు రాజకీయాల్లో తిరిగిన పవన్ కళ్యాణ్...ఎన్నికలు పూర్తయ్యయి కాబట్టి షూటింగుకు డేట్స్ ఇస్తారని భావిస్తున్నారు. మరి ఏం జరుగబోతోందో చూడాలి. మరి స్నేహితుడి కష్టాలు తీర్చడానికి పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











