'బాహుబలి' తో శర్వానంద్ బిజినెస్

By Srikanya

హైదరాబాద్ : రన్ రాజా రన్ చిత్రం హిట్ తో మంచి ఊపు మీద ఉన్న శర్వానంద్ ఇప్పుడు బిజినెస్ పరంగా మరో స్టెప్ తీసుకున్నాడని ట్రేడ్ వర్గాల సమాచారం. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'బాహుబలి' చిత్రం ఓ ఏరియా రైట్స్ ని సొంతం చేసుకోవాలని ఆయన చర్చలు జరుపుతున్నట్లు చెప్తున్నారు. ప్రభాస్ తో ఉన్న సన్నిహిత్వంతో ఈ చిత్రం రైట్స్ ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఏ ఏరియా అనేది ఇంకా తెలియరాలేదు. గతంలో కో అంటే కోటి చిత్రంతో పెట్టుబడి పెట్టి పోగొట్టుకున్న శర్వానంద్ ఇప్పుడు తన బ్యాడ్ పీరియడ్ అయిపోయిందని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏరియా రైట్స్ తీసుకోవటం అంటున్నారు.

మరో ప్రక్క ఓవర్ సీస్ బిజినెస్ పూర్తైంది. ఏప్రియల్ 2015 లో విడుదల అయ్యే ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని బ్లూ స్కై వారు 9 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. ఈ తొమ్మిది కోట్లు తొలి భాగం మేరకే అని చెప్తున్నారు. ఈ మేరకు అగ్రిమెంట్ జరిగిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది.

Sharwanand buys Baahubali rights?

ప్రముఖ దర్శకుడు రాజమౌళి...భారీ స్ధాయిలో బాహుబలి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాహుబలి'. రానా ముఖ్యభూమిక పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్స్. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగుతోంది. మరో ప్రక్క ఈ చిత్రం బిజినెస్ జోరుగా జరుగుతోంది.

ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకుని తమ ప్రతిభను చూపిస్తున్నారు.

రమ్యకృష్ణ నెగిటివ్ రోల్ లో బాహుబలి చిత్రంలో కనపించనుంది. అన్నదమ్ములుగా రానా, ప్రభాస్ కనిపిస్తారు. రాజ్యంకోసం జరిగే కుట్రలతో ఈ చిత్రం సాగుతుంది.మరో ప్రక్క ఈ చిత్రం గురించి వినిపిస్తున్న వూహాగానాలు అన్నీ ఇన్నీ కావు. కొబ్బరికాయ కొట్టకముందే బోలెడన్ని కబుర్లు వినిపించాయి. సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. దాంతో బిజినెస్ కూడా అదే రేంజిలో జరుగుతోంది.

షూటింగ్ కు ముందు నుంచి ఈ చిత్రం రోజుకో వార్తతో రికార్డు క్రియోట్ చేస్తోంది. ప్రభాస్ గెటప్ దగ్గరనుంచి ఈ చిత్రంలో ప్రతీదీ సంచలనమే. ఐమాక్స్‌ ఫార్మాట్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. యారీ ఎలెక్సా ఎక్స్‌.టి. కెమెరాని వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు కేరళ, తమిళనాడు, రాజస్థాన్‌లలో చిత్రీకరణ జరుగేటట్లు ప్లాన్ చేసారు.

ఇక ఈ చిత్రం కథ అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరుగా తీర్చి దిద్దుతున్నారని తెలుస్తోంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X