For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దిల్ రాజు అప్పులు చేసి సినిమా తీస్తున్నాడా? వీళ్లంతా ఎవరు? (ఫోటోస్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: శర్వానంద్‌ హీరోగా సతీష్‌ వేగ్నేశ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ ప్రొడక్షన్‌ నెం.24 కొత్త చిత్రం 'శతమానంభవతి'. ఈ సినిమా శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని దిల్‌రాజు కార్యాలయంలో ప్రారంభమైంది.

  అయితే ఈ సినిమాను దిల్ రాజ్ అప్పు చేసి చేస్తున్నాడనే రూమర్ ఫిల్మ్ నగర్లో చరక్కర్లు కొడుతోంది. తెలుగులో నష్టాలు లేకుండా నిర్మాతగా నొలదొక్కుకున్నాడనే పేరు దిల్ రాజుకు ఉండేది. అయితే ఈ మద్య కాలంలో కొన్ని సినిమాల ఫలితాలు దిల్ రాజును ఆర్థికంగా దెబ్బతీసాయని, దీంతో ఫైనాన్షియర్ల వద్ద అప్పు చేసి సినిమా తీస్తున్నాడని టాక్.

  శతమానం భవతి సినిమా ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్సియర్‌ సత్యరంగయ్య క్లాప్‌ కొట్టగా, సత్య రంగయ్య మనవడు రంగ యశ్వంత్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. సత్య రంగయ్య తనయుడు ప్రసాద్‌ గౌరవ దర్శకత్వం వహించారు.... వీరు ఈ సినిమాకు ఫైనాన్స్ చేస్తున్నారని టాక్

  సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో దిల్ రాజు ఇంకా ఏం మాట్లాడారు? సినిమాకు సంబంధించిన అంశాలు ఏం చెప్పారు అనే విషయాలు, సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు.. స్లైడ్ షోలో....

  సినిమా ప్రారంబోత్సవానికి వారి రాక పై దిల్‌రాజు ఏమన్నారంటే..

  సినిమా ప్రారంబోత్సవానికి వారి రాక పై దిల్‌రాజు ఏమన్నారంటే..

  ''మా బ్యానర్‌లో ప్రొడక్షన్‌ నెం.24 చిత్రంగా 'శతమానం భవతి' సినిమా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కథ మూడు తరాలకు సంబంధించింది. మాకు బాగా కావాల్సిన సత్య రంగయ్యగారు, ఆయన కుమారుడు ప్రసాద్‌, మనవడు చేతుల మీదుగా సినిమాను లాంచ్‌ చేశామని తెలిపారు.

  షూటింగ్

  షూటింగ్

  సెప్టెంబర్‌ 14 నుండి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. నవంబర్‌కంతా చిత్రీకరణను పూర్తి చేస్తామని దిల్ రాజు తెలిపారు.

  సంక్రాంతికి

  సంక్రాంతికి

  షూటింగ్ అనంతడరం వీలైనం తర్వగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి14న విడుదల చేస్తున్నామని దిల్ రాజు తెలిపారు.

  ఆ టైటిలే ఎందుకంటే..

  ఆ టైటిలే ఎందుకంటే..

  సాధారణంగా పెద్దలు ఆశీర్వదించేటప్పుడు చెప్పే 'శతమానం భవతి' అనే టైటిల్‌లోనే ఒక పాజిటివ్‌ వైబ్రేషన్‌ ఉంది. దీన్ని యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌ అందరికీ నచ్చేలా స్క్రిప్ట్‌ సిద్ధం చేశామని దిల్ రాజు తెలిపారు.

  డైరెక్టర్ గురించి..

  డైరెక్టర్ గురించి..

  డైరెక్టర్‌ సతీష్‌ వేగ్నేశ, హరీష్‌ శంకర్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసేటప్పుడు నుండి పరిచయం. తను చెప్పిన పాయింట్‌ను అందరికీ నచ్చేలా స్క్రిప్ట్‌ తయారు చేయడానికి టైం పట్టింది అని దిల్ రాజు తెలిపారు.

  శర్వానంద్ గురించి..

  శర్వానంద్ గురించి..

  హీరో శర్వానంద్‌ హీరో కావాలనుకున్నప్పుడు డైరెక్టర్‌ తేజకు తనని నేనే పరిచయం చేశాను. పన్నెండేళ్ళ తర్వాత ఇప్పుడు శర్వానంద్‌ మా బ్యానర్‌లో సినిమా చేయాలని రాసి పెట్టి ఉందేమో. ఈ శతమానంభవతిలో తను హీరోగా చేయడం చాలా హ్యాపీగా ఉంది అని దిల్ రాజు తెలిపారు.

  కల్పితం కాదు...

  కల్పితం కాదు...

  ''సాధారణంగా ఏ సినిమానైనా స్టార్‌ చేసేటప్పుడు ఈ సినిమాలోని పాత్రలు కల్పితం అని వేస్తారు. కానీ మా 'శతమానంభవతి'సినిమా కల్పితం కాదు..జీవితం. ఒక జీవితానికి సంబంధించిన విషయాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నామని దర్శకుడు తెలిపారు.

  దిల్ రాజు గురించి దర్శకుడు

  దిల్ రాజు గురించి దర్శకుడు

  దిల్‌రాజుగారు నాకు అవకాశం ఇవ్వడమే కాకుండా ఈ కథకు శతమానంభవతి అనే టైటిల్‌ అయితే బావుంటుందని కూడా ఆయన సజెస్ట్‌ చేశారు. శతమానంభవతి అంటే ఆశీర్వాదం..కాబట్టి ఆయన టైటిల్‌తోనే నన్ను ఆశీర్వదించారు అని దర్శకుడు చెప్పుకొచ్చారు.

  స్క్రిప్లులో మార్పులు చేసిన దిల్ రాజు

  స్క్రిప్లులో మార్పులు చేసిన దిల్ రాజు

  నేను చెప్పిన స్క్రిప్టులో దిల్ రాజు కొన్ని కరెక్షన్స్ చేసాడు. అందు వల్లే స్క్రిప్ట్‌ బాగా వచ్చింది. వచ్చే సంక్రాంతికి మా 'శతమానంభవతి' సినిమా ప్రేక్షకులందరినీ అలరిస్తుంది అని దర్శకుడు తెలిపారు.

   నటీ నటులు :

  నటీ నటులు :

  శర్వానంద్ , అనుపమ పరమేశ్వరన్ , ప్రకాష్ రాజ్ , జయసుధ , ఇంద్రజ , శివాజీ రాజా , ప్రవీణ్ , సిజ్జు , శ్రీ రాం , మధురిమ , నీల్యా , ప్రమోదిని, మహేష్ , భద్రం ,హిమజ , ప్రభు తదితరులు

  తెర వెనక

  తెర వెనక

  సాంకేతిక నిపుణులు :

  ఛాయాగ్రహణం - సమీర్ రెడ్డి

  సంగీతం - మిక్కీ జె. మేయర్

  సాహిత్యం - శ్రీ సీతారామశాస్త్రి , రామజోగయ్య శాస్త్రి

  కూర్పు - మధు

  కళా దర్శకుడు - రమణ వంక

  కథ - కథనం -మాటలు-దర్శకత్వం - వేగేశ్న సతీష్.

  అనుపమ

  అనుపమ

  ఈ చిత్రంలో అనుప పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోెంది.

  English summary
  Sharwanand, Anupama Parameswaran acting Dil Raju's Shatamanam Bhavathi Opening held today (27th Aug) morning at Hyderbad
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X