చిరంజీవి మూవీలో రామ్ చరణ్ ఫ్రెండ్: టిల్లు స్థానంలో అతడా? ఆ హీరోయిన్ కొడుకు అంటే నమ్ముతారా?

టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడం కూడా ఇప్పుడు కష్టంగా మారింది. కానీ, కొందరు మాత్రం ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ఏకధాటిగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇలా త్వరలోనే ఆయన మరో ప్రాజెక్టును చేయబోతున్నారు. ఇక, ఈ చిత్రంలో టాలీవుడ్‌లోని ఓ టాలెంటెడ్ హీరో నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

భోళా శంకర్‌‌ వస్తున్నాడుగా:చిరంజీవి నటించిన తాజా చిత్రమే 'భోళా శంకర్'. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ మూవీ తమిళ చిత్రం 'వేదాళం'కు రీమేక్‌గా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తవగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రం ఇటీవలే కంప్లీట్ అయింది. ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసేశారు.

Sharwanand Fix for Chiranjeevi and Kalyan Krishna Movie

బంగార్రాజు డైరెక్టర్‌తో చిరు:ఒకటి పట్టాలపై ఉండగానే మరో సినిమాను లైన్‌లో పెట్టే మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటికే 'బంగార్రాజు' డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కురసాలతో ఓ ప్రాజెక్టుకు సిగ్నల్ ఇచ్చారు. దీన్ని మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మించబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్లు చేస్తున్నారు.

ఆ మూవీ రీమేక్.. మరో హీరో:'భోళా శంకర్' తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలోనే సినిమా చేయబోతున్నారు. ఇందులో మరో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా నటిస్తున్నట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. ఇక, ఈ సినిమా మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'బ్రో డాడీ'కి రీమేక్‌గానే వస్తున్నట్లు కూడా తెలిసింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

Sharwanand Fix for Chiranjeevi and Kalyan Krishna Movie

ఆరోజునే.. చిరంజీవి త్రిష:మెగాస్టార్ చిరంజీవి - కల్యాణ్ కృష్ణ కురసాల కాంబినేషన్‌లో రాబోతున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే, సిద్దు జొన్నలగడ్డకు జోడీగా శ్రీలీల ఎంపికైనట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ప్రారంభం కాబోతుందని కూడా న్యూస్ లీకైంది.

Sharwanand Fix for Chiranjeevi and Kalyan Krishna Movie

తప్పుకున్న యంగ్ హీరో:ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ మరో హీరోగా నటిస్తున్నాడని ఎప్పుడో న్యూస్ లీకైంది. ఇందులో అతడు చిరంజీవి కొడుకుగా చేస్తున్నాడని కూడా టాక్ వచ్చింది. కానీ, ఈ చిత్రం నుంచి సిద్దు జొన్నలగడ్డ తప్పుకున్నాడని ఇటీవలే న్యూస్ బయటకు వచ్చింది. డేట్స్ కుదరకపోవడం వల్లే ఈ యంగ్ హీరో దీని నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ఫిలిం నగర్‌లో ప్రచారం జరుగుతోంది.

Sharwanand Fix for Chiranjeevi and Kalyan Krishna Movie

చరణ్ ఫ్రెండ్‌కే ఛాన్స్:చిరంజీవి మూవీ నుంచి సిద్దు జొన్నలగడ్డ తప్పుకోవడంతో ఆ స్థానంలో ఎవరిని తీసుకుంటారన్న దానిపై ఎన్నో రకాల చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే కొందరు హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ ఫ్రెండ్ శర్వానంద్‌‌ను చిరంజీవి ఫైనల్ చేశారని తెలిసింది. అంటే వీళ్లిద్దరూ ఈ చిత్రంలో తండ్రి కొడుకుగా నటించబోతున్నారు.

Sharwanand Fix for Chiranjeevi and Kalyan Krishna Movie

త్రిషకు శర్వా కొడుకుగా:క్రేజీ కాన్సెప్టుతో వచ్చే ఈ సినిమాలో చిరంజీవి భార్యగా త్రిష నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో శర్వానంద్‌ను తీసుకోవడంతో ఇప్పుడు సరికొత్త చర్చలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవికి శర్వా కొడుకుగా అంటే బాగుంటుంది కానీ.. త్రిష అతడి తల్లిగా కనిపించడం అంటే మాత్రం అంత నమ్మశక్యంగా ఉండదని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X