ఆ యంగ్ హీరోతో ఇంద్రగంటి మోహన్ కృష్ణ చిత్రం
అష్టాచెమ్మ,గోల్కొండ హైస్కూల్ వంటి చిత్రాలతో తనకంటూ ఓ మార్కెట్, ప్రేక్షకులను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఆయన తాజాగా శర్వానంద్ ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. కళ్యాణ్ మాలిక్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి భాస్కర్ కెమెరా అందించనున్నారు. ప్రస్తుతం ఇంద్రగంటి తన స్క్రిప్టుకు ఫైనల్ టచెస్ ఇస్తున్నారు. కలర్స్ స్వాతి హీరోయిన్ చేస్తోంది. మొదట ఈ ప్రాజెక్టుని నానితో అనుకున్నారు. కానీ నాని బిజిగా ఉండటంతో ఇప్పుడు శర్వానంద్ ఈ చిత్రంలోకి వచ్చారు. ఇక శర్వానంద్ హీరోగా మురుగదాస్ నిర్మాతగా హాలీవుడ్ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోతో కలిసి నిర్మించిన 'ఎంగేయుమ్ ఎప్పోదుమ్' చిత్రాన్ని ఎస్.కె.పిక్చర్స్ అధినేత సురేష్ కొండేటి తెలుగులోకి అనువదిస్తున్న సంగతి విదితమే.
తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. 'గమ్యం', 'ప్రస్థానం' సినిమాల తరువాత మళ్లీ అతనికి అంత పేరు తెచ్చే సినిమా ఇది. రెండు జంటలమధ్య సాగే రెండు ప్రేమకథలతో ఈ సినిమా ఉంటుంది. విడివిడిగా సాగే ఈ కథలకు క్లైమాక్స్ సీన్స్ లో లింక్ ఉంటుంది.ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో పాటలు కూడా బాగా వచ్చాయి' అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: సిహెచ్.ప్రద్యుమ్న, సంగీతం: సత్య, ఫొటోగ్రఫీ: వేల్‌రాజ్, సమర్పణ: 3కె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి., నిర్మాత: సురేష్ కొండేటి, దర్శకత్వం: శరవణన్.


Click it and Unblock the Notifications











