రామ్ చరణ్ తోడళ్ళుడు శర్వానంద్??? ఉపాసన చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నాడా??

రామ్ చరణ్ కు శర్వానంద్ చిన్న నాటి స్నేహితుడన్న సంగతి చాలామందికి తెలియదు. ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఏమీ రాసుకు పూసుకు తిరిగేయరు కానీ.. ఇద్దరి మధ్య మంచి అనుబంధముంది. అది అరుదుగా బయటికి వస్తుంటుంది. అప్పట్లో 'ఎక్స్ ప్రెస్ రాజా' విడుదల నేపథ్యంలో దాని గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడి.. ఆల్ ద బెస్ట్ చెప్పడానికి శర్వాతో చెర్రీకి ఉన్న ఫ్రెండ్షిప్పే కారణం.

ఆరోజే చాలా మందికి వీళ్ళిద్దరూ క్లోహ్ ఫ్రెండ్స్ అన్న విషయం అర్థమయ్యింది. ఈ సినిమా విషయంలో తనకు వ్యక్తిగతంగానూ చెర్రీ కాంప్లిమెంట్స్ ఇచ్చినట్లు చెప్పాడు శర్వా. ''చరణ్ బెంగళూరులో ఉండటం వల్ల ఇంకా 'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమా చూడలేదు. ఐతే విడుదలకు ముందు పాటలు మాత్రం చూపించాం. ఓ పాటలో నా డ్యాన్స్ చూసి.. 'ఏంట్రా ఈ రేంజిలో డ్యాన్స్ చేశావ్' అంటూ ఆశ్చర్యపోయాడట చరణ్... ఈ విషయాన్ని కూడా చెప్పాడు శర్వానంద్.

తమిళంలో కూడా:

తమిళంలో కూడా:

శర్వానంద్.. మంచి మంచి సినిమాలు చెస్తూ... టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగులోనే కాకుండా.. తమిళంలో కూడా శర్వానంద్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇంత ఫాలోయింగ్ ఉన్న హీరో ఇప్పటి వరకూ ఎక్కడా ఎఫైర్లలో ఇరుక్కున్నట్టు కనిపించలేదు.. అయితే వరసగా యంగ్ హీరోలు పెళ్లి చేసుకోబుతున్నారు. నాగ చైతన్, అఖిల్, నితిన్ ల పెళ్లిల సంబంధించి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.. ఇదే సమయం లో తాను కూడా పెళ్ళి చేసేసుకుందామ అనుకుంటున్నాడట శర్వానంద్.

మెగా హీరో రామ్ చరణ్:

మెగా హీరో రామ్ చరణ్:

అయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే.. శర్వ.. మెగా హీరో రామ్ చరణ్ కి తోడల్లుడు కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి చరణ్ కి శర్వ తోడల్లుడు ఎలా అవుతున్నాడు అనుకుంటున్నారా.. అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.రామ్ చరణ్ వైఫ్ ఉపసాన సిస్టర్ ను శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.పెళ్లిపీఠలు ఎక్కనున్నాడు అనేకంటే మెగా హీరో రామ్‌చరణ్‌కి తోడళ్ళుడు కాబోతున్నాడనేది ఎక్కువ పాపులర్ అవుతోంది.

ధృవీకరించటం అయితే జరగలేదు:

ధృవీకరించటం అయితే జరగలేదు:

అపోలో వ్య‌వ‌స్థాప‌కులు, సీసీ రెడ్డి మ‌న‌వ‌రాలిని రామ్‌చ‌ర‌ణ్ వివాహం చేసుకున్నారు. ఉపాస‌నకు ఇద్ద‌రు సోద‌రీమ‌ణులు. వారిలో ఒక‌రిని శ‌ర్వానంద్‌కి ఇచ్చి వివాహం చెయ్యాల‌నే ఆలోచ‌న‌లో ఉంద‌ట కామినేని శోభ‌న కుటుంబం. ఇప్ప‌టికే, దీనికి సంబంధించి అన్ని వైపుల నుంచి పెద్ద‌లు మాట్లాడుకోవ‌డం కూడా జ‌రిగింద‌ని, త్వ‌రలోనే ఓ మాట ద్వారా ఫైన‌లైజ్ చెయ్య‌డ‌మే అని తెలుస్తోంది. ఈ వార్తలన్నీ బయట వినిపిస్తున్నాయి గానీ రెండువైపులలో ఎవరూ ధృవీకరించటం అయితే జరగలేదు.

ప్ర‌చారం జ‌రుగుతోంది:

ప్ర‌చారం జ‌రుగుతోంది:

శ‌ర్వానంద్‌ది విజ‌య‌వాడ‌. ఆయ‌నకు మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉంద‌ని స‌మాచారం. ఆర్థికంగా వారి కుటుంబం బాగా సెటిల‌యింద‌ని, శ‌ర్వానంద్ తండ్రి మంచి బిజినెస్ మేగ్న‌ట్ అని.. అందుకే, ఈ మ్యారేజ్‌కి ఓకే చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇటు, సీసీ రెడ్డి కుటుంబం గురించి స్పెష‌ల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇక‌, శ‌ర్వానంద్ మ్యారేజ్‌కి రామ్‌చ‌ర‌ణ్ రిక‌మండేష‌న్ ఉండ‌నే ఉంది. ఇంకేముంది.. దాదాపు ఈ ఇద్ద‌రూ ఇక కో బ్ర‌ద‌ర్స్‌కావ‌డ‌మే మిగిలి ఉంది అనే రేంజ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వార్త‌లో నిజ‌మెంత అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

ఫిలింనగర్ టాక్:

ఫిలింనగర్ టాక్:

చెర్రి భార్య ఉపాసన చెల్లెల్ని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడని ఫిలింనగర్ టాక్. ఇదే నిజమైతే రామ్‌చరణ్‌కు తోడళ్ళుడిగా శర్వానంద్‌ని చూడవచ్చు శ‌ర్వానంద్ - రాంచ‌ర‌ణ్ మంచి ఫ్రెండ్స్ కదా. వీరిద్ద‌రు చిన్న‌ప్ప‌టి నుంచి కూడా క్లాస్‌మేట్స్‌. ఇక ఇప్పుడు అన్ని కుదిరితే వీరు తోడి అల్లుళ్లు కూడా కాబోతున్నార‌న్న‌మాట‌. ఇక శర్వానంద్ సినిమాల విషయంకు వస్తే... సతీష్‌ వేగ్నేశ దర్శకత్వంలో 'శతమానంభవతి' అనే సినిమాలో నటిస్తున్నాడు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ సినిమాలో నటిస్తూ.. చిరు 150వ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహారిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X