ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్న శర్వానంద్.. నిర్మాతలకి ఆ విధంగా సాయం?

శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకున్న శర్వానంద్ ప్రస్తుతం ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత ఆయన మరో సినిమా ఇప్పటికే అనౌన్స్ చేశాడు.. అయితే ఆ సినిమాకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

వార్తల్లో శర్వానంద్

వార్తల్లో శర్వానంద్

హీరో శర్వానంద్ గత కొద్ది రోజులుగా వార్తలు నిలుస్తున్నారు. చివరిగా శ్రీకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ సినిమా నిర్మాతలు తనకు ఇంకా పూర్తి స్థాయిలో రెమ్యూనరేషన్ చెల్లించలేని కారణంగా వారికి లీగల్ నోటీసులు పంపిన అంశం టాలీవుడ్ మొత్తం మీద చర్చనీయాంశంగా మారింది. అసలు ఎలాంటి వివాదాల జోలికి వెళ్లని ఈ హీరో ఎందుకు ఇలా పంపాడా అనే చర్చ ఇప్పటికీ జరుగుతోంది.

మహాసముద్రం

మహాసముద్రం

ఆ చర్చ సంగతి అలా పక్కనపెడితే ప్రస్తుతం ఆయన ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన సిద్ధార్థ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. అదితీరావ్ హైదరీ, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

ఆడవాళ్లు మీకు జోహార్లు

ఆడవాళ్లు మీకు జోహార్లు

ఆడవాళ్లు మీకు జోహార్లు అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర న్యూస్ బయటకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమా కోసం శర్వానంద్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. అయితే దీనికి కారణం గతంలో శర్వానంద్ హీరోగా వచ్చిన ఒక డిజాస్టర్ సినిమా అని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన పడి పడి లేచే మనసు సినిమా భారీ అంచనాలతో రిలీజ్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

ఫ్రీగా సినిమా

ఫ్రీగా సినిమా

లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ గా పేరున్న హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమా విషయంలో ఆయన నష్టపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన నిర్మాణంలోని ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం శర్వానంద్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ అయితే అప్పుడు తనకు లాభాల్లో వాటా ఇవ్వమని నిర్మాతలను కోరాడని తెలుస్తోంది.

Recommended Video

Sharwanand Sends Legal Notice To His Producers, చిచ్చు పెట్టిన కోట్లు ! || Filmibeat Telugu
ఇక నో టెన్షన్

ఇక నో టెన్షన్

నిజానికి మిగతా భాషల సంగతి ఎలా ఉన్నా తెలుగు సినిమా విషయానికి వస్తే సినిమాలో అతిపెద్ద పెట్టుబడి ఏదైనా ఉంది అంటే అది హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్లు అని చెప్పక తప్పదు. ఇప్పుడు హీరో ఎలాగూ రెమ్యూనరేషన్ తీసుకోను అని చెబుతున్నాడు కాబట్టి నిర్మాతలు టెన్షన్ లేకుండా సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయవచ్చు.. అయితే ఈ పద్ధతిని గతంలో కొంతమంది హీరోలు ఫాలో అయినా సరే తన వల్ల నష్టపోయిన నిర్మాతలను కోసమే శర్వానంద్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X