రామ్ గోపాల్ వర్మ చిత్రంలో శర్వానంద్
హైదరాబాద్: మొన్న శుక్రవారం విడుదలైన "కో అంటే కోటి" చిత్రం శర్వానంద్ కు కమర్షియల్ గా వర్కువుట్ కాకున్నా కెరీర్ పరంగా బ్రేక్ ఇచ్చిందని విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రం గురించి తెలుసుకున్న రామ్ గోపాల్ వర్మ తన సత్య సీక్వెల్ కి శర్వానంద్ ని అడిగినట్లు తెలుస్తోంది. దాంతో శర్వానంద్ చాలా ఉత్సాహంగా తను పెట్టుబడి పెట్టి మరీ నటించిన చిత్రం అనుకున్న ఫలితాలను రాబట్టిందని అంటున్నట్లు వినపడుతోంది. "కో అంటే కోటి" లో డార్క్ షేడ్ తో శర్వానంద్ చేసిన పాత్ర వర్మను ఎట్రాక్ట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.
ఇక రామ్ గోపాల్ వర్మ కెరీర్ లో పెద్ద హిట్ గా నమోదై బాలీవుడ్ లో వర్మ స్ధానం సుస్ధిరం చేసిన సత్య చిత్రం సీక్వెల్ అంటే ట్రేడ్ లోనూ అంచనాలూ బాగా ఉంటాయి. రామ్ గోపాల్ వర్మ,జెడీ చక్రవర్తి కాంబినేషన్ లో రూపొందిన సత్య అప్పట్లో ఓ సంచలనం. ముంబై మాఫియామీద వర్మ తీసన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్ ని జాన్ అబ్రహం నిర్మించబోతున్నట్లు సమాచారం.
విక్కీ డోనర్ చిత్రంతో నిర్మాతగా విజయం సాధించిన జాన్ అబ్రహం ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తిగా ఉన్నారు. తన బ్యానర్ పై సీరియస్ సబ్జెక్టులు చేయాలనుకుంటున్నట్లు జాన్ తెలిపారు. అందులో భాగంగానే వర్మ నుంచి విన్న సత్య సీక్వెల్ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక సత్య సీక్వెల్ లో జెడీ నటిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. తెలుగు వెర్షన్ కు గానూ ఎవరు నిర్మిస్తారు అనే విషయాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications












