అప్పటి గాయానికి ఇప్పుడు చికిత్స.. విశ్రాంతి తీసుకోనున్న యంగ్ హీరో
యంగ్ హీరో శర్వానంద్‌కు అప్పట్లో గాయమైన సంగతి తెలిసిందే. జాను మూవీ షూటింగ్ సమయంలో శర్వా భుజానికి గాయమైంది. వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఓ రెండు మూడు రోజుల విశ్రాంతి అనంతరం మళ్లీ యథావిథిగా జాను షూటింగ్‌లో పాల్గొన్నాడు.
అయితే జాను సినిమా విడుదలైంది.. మంచి ప్రశంసలు దక్కించుకుంది.. శర్వా నటనకు మంచి మార్కులే పడ్డాయి.. కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే జాను మూవీ షూటింగ్ ఆలస్యమవుతుందని అప్పట్లో సర్జరీ చేయించుకోలేదట. తాజాగా సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది.

శర్వానంద్ అమెరికా వెళ్లి సర్జరీ చేయించుకున్నాడని తెలుస్తోంది. ఇంకో రెండు మూడు రోజుల తరువాత హైద్రాబాద్ చేరుకుని, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడట. అటుపై శ్రీకారం మూవీ షూటింగ్ పూర్తి చేసేస్తాడట. అయితే శ్రీకారం విడుదలకు అంతా సిద్దమవుతున్నా.. కరోనా వల్ల వాయిదా పడే అవకాశం ఉందని టాక్.


Click it and Unblock the Notifications











