ఆ హీరోతో సాయిప‌ల్ల‌వి సై.. మరోసారి ఆ కాంబో రిపీట్!

యంగ్ హీరోయిన్, నాచురల్ బ్యూటీ సాయిప‌ల్ల‌వి 'ఫిదా' అంటూ తెలుగు యువత మనసు దోచుకుంది. ఆ తర్వాత ఎంసీఏ, పడి పడి లేచే మనసు సినిమాలతో ఆకట్టుకున్న ఈమె మరోసారి టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోందట. అది కూడా గతంలో జోడీ కట్టిన హీరోతోనే.

పడి పడి లేచే మనసు మూవీ యంగ్ హీరో శర్వానంద్ సరసన నటించి మెప్పుపొందిన సాయి పల్లవి.. మరోసారి ఆ హీరోతోనే నటించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాను కిషోర్ తిరుమ‌ల డైరెక్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది. సుధాక‌ర్ చెరుకూరి నిర్మాణంలో ఈ కొత్త‌ సినిమా రూపొందనుందనే టాక్ బయటకొచ్చింది.

Sharwanand upcoming movie with Sai Pallavi,

శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం 'శ్రీకారం' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్త‌యిన వెంటనే త‌న కొత్త సినిమాను స్టార్ట్ చేస్తాడ‌ట శ‌ర్వానంద్. ఆ లోపు కిషోర్ తిరుమ‌ల కూడా ఫ్రీ అవుతాడని తెలుస్తోంది. ప్ర‌స్తుతం రామ్‌తో తెర‌కెక్కిస్తోన్న 'రెడ్' చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్న కిషోర్ తిరుమ‌ల.. ఆ వెంటనే శర్వానంద్ సినిమా పనుల్లోనే పడనున్నారని తెలుస్తోంది.

ఇకపోతే ఇటీవలే జాను సినిమాతో శర్వానంద్ కాస్త నిరాశ చెందిన సంగతి తెలిసిందే. సమంతతో జోడీ కట్టిన శర్వానంద్ ఈ సినిమాతో ఆశించిన రిజల్ట్ రాబట్టలేకపోయాడు. ఈ మేరకు తన తదుపరి సినిమా విషయమై ప్రత్యేక శ్రద్ద తీసుకునేలా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X