twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెన్సార్ చిక్కుల్లో శర్వానంద్ కొత్త చిత్రం

    By Srikanya
    |

    హైదరాబాద్ : శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై శర్వానంద్, నిత్యామీనన్ జంటగా నిర్మిస్తున్న చిత్రం 'ఏమిటో ఈ మాయ'. ప్రముఖ తమిళ దర్శకుడు చేరన్ డైరక్ట్ చేసిన ఈ చిత్రానికి స్రవంతి రవికిషోర్‌ నిర్మాత. ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ లో సమస్యలు ఎదుర్కొంటోందని ఫిల్మ్ నగర్ సమాచారం. చిత్రం డబ్బింగ్ చిత్రంగా పరిగణించి సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తాననటంతో నిర్మాత షాక్ అయినట్లు తెలుస్తోంది. తాము ద్వి భాషా చిత్రం గా దీని షూటింగ్ పూర్తి చేసామని నిర్మాతలు ఖండిస్తున్నారు. అయితే రీజనల్ ఆఫీసర్ స్ట్రైయిట్ చిత్రం అని నిరూపించటానికి తగ్గ రుజువులు అడగటం జరిగిందని తెలుస్తోంది. డబ్బింగ్ సినిమాగా చిత్రాన్ని సెన్సార్ చేస్తే టాక్స్ విషయంలో సమస్యలు వస్తాయి.

    నిర్మాత మాట్లాడుతూ ''పిల్లలపై తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకుంటారు. తాము కన్న కలల్ని సాకారం చేయాలని ఆశిస్తుంటారు. అయితే ఈ విషయంలో యువత ఏం చేస్తోందనేదే ఈ చిత్ర ప్రధానాంశం. నేటి తరం ప్రేమ వ్యవహారాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు చేరన్‌. మనసుని హత్తుకునేలా భావోద్వేగాలుంటాయి. అంతే స్థాయిలో వినోదమూ ఉంటుంది. ఈ సినిమా యువతనే కాకుండా అందరినీ ఆకట్టుకొంటుంది. శర్వానంద్‌, నిత్యమీనన్‌ల జంట అందరినీ అలరిస్తుంది. '' అన్నారు.

    జాతీయ అవార్డ్‌ గ్రహీత చేరన్‌తో పనిచేయడం ఆనందాన్నిస్తోందని శర్వానంద్‌ అన్నారు. సిటీ నేపథ్యంలోని చక్కని కథాంశమిదని నిత్యామీనన్‌ తెలిపింది. వృత్తి, ఉద్యోగ జీవితం.. అంటూ నేటి యువత ఉరుకులు.. పరుగులు పెడుతోంది. అనుబంధాలు, ఆత్మీయతలకు దూరంగా పరిగెడుతున్న వారు ఏం కోల్పోతున్నారో మా చిత్రంలో చూపిస్తున్నామంటున్నారు చేరన్‌.

    ఎంగేయుమ్ ఎప్పోదుమ్ (జర్ని)చిత్రంతో హిట్‌కొట్టిన తెలుగు నటుడు శర్వానంద్‌ను చేరన్ తన చిత్రలో హీరోగా ఎంచుకోవటం తో చాలా ఆనందగా ఉన్నాడు. ప్రేమ కథా చిత్రం కావటంతో యువతకు బాగా పడుతుందని,చేరన్ కి తెలుగులో సైతం మంచి పేరు ఉండటంతో ఇక్కడా ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. దానికి తోడు నిత్యామీనన్ ఉందంటే డిస్ట్రిబ్యూటర్స్,ఎగ్డిబిటర్స్ ఆసక్తి చూపుతున్నారు. సినిమా ఎలా ఉన్నా ఓపినింగ్స్ కు లోటు ఉండదని,చిన్న సినిమాలకు ఓపినింగ్స్ బాగా మేలు చేస్తాయని చెప్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌ కుమార్‌, పాటలు: అనంత శ్రీరామ్‌, సమర్పణ: కృష్ణ చైతన్య.

    English summary
    Sharwanand, Nitya Menon's ‘Yemito Ee Maaya’ directed by Cheran plunged into censor problems. Film makers are shocked when censor board planned to certify the film as dubbing film. Film makers contended the board's decision on which Regional Officer asked them to submit proof, to show their film is a straight one.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X