చరణ్ ‘ఆరెంజ్’సినిమా ఎలా ఉన్నా ఈ ‘ఆరెంజ్’ మాత్రం చాలా ఫ్రెష్
ఆరెంజ్ సినిమా గురించి ఎవరెలాంటి టాక్ మాట్లడుతున్నా కానీ అందరూ కలిసి ఏకగ్రీవంగా ఒప్పుకొంటున్న ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే 'రూబా"గా నటించిన షాజాన్ పదాంసీ. హిందీలో 'రాకెట్ సింగ్" తో పరిచయమైన షాజాన్ కి తెలుగులో ఇదే తొలి చిత్రం. క్యారెక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ దష్ట్యా ఫ్రెష్ ఫేస్ కోసం చూస్తున్న సమయంలో భాస్కర్ కి షాజాన్ తారసపడడం, ఆమెని మిగతా యూనిట్ అంతా ఒకే చేయడం జరిగిపోయాయి.
'ఆరెంజ్" లో ఆమె కనిపించింది చాలా కొద్ది సేపే అయినా ఆ సమయంలోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకోగలిగింది. ఆమె అమాయకపు ముఖం, అందమైన నవ్వు అందరి ప్రశంసలు అందుకుంటోంది. 'ఆరెంజ్" సినిమా ఎలా ఉన్నా షాజాన్ మాత్రం ఓ రేంజ్ లో ఉందని అంటున్నారు. ఈ చిత్రంతో షాజాన్ తెలుగులో టాప్ గ్రేడ్ హీరోయిన్ గా ఎదిగేందుకు అవసరమైన అవకాశాలను దక్కించుకుంటుందేమో చూడాలి ఆమె లుక్స్, హైట్ తెలుగు యువ హీరోల్లో చాలా మందికి మంచి మ్యాచ్ కాగలదు. ఈ టాక్ ని అనుకూలంగా వాడుకుని రైట్ ఫిలింస్ సెలక్ట్ చేసుకుంటే పదామ్సీ తెలుగులో క్లిక్ కావడం పెద్ద సమస్యేం కాదు అంటున్నారు సినీ ప్రేక్షకులు..


Click it and Unblock the Notifications











