Shefali Jariwala: షఫాలీ మరణానికి ఆ ఇంజెక్షనే కారణమా? పోస్ట్‌మార్టంలో ఏం తేలిందంటే?

కాంటా లగా ఫేమ్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ షఫాలీ జరివాలా హఠాన్మరణం చిత్ర పరిశ్రమను, ఆమె అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గుండెపోటుతో షఫాలీ మరణించినట్లుగా వార్తలు రావడంతో అంతా షాక్ అవుతున్నారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్ పట్ల ఎంతో శ్రద్ధ ఉన్న షఫాలీకి గుండెపోటు రావడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తేనే కానీ షఫాలీ మరణానికి ఖచ్చితమైన కారణం ఏంటనేది తెలియరాలేదు. తాజాగా ఓ కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..

కాంటా లగా ఆల్బమ్‌తో ఫేమ్
ఫఫాలీ జరివాలా పలు మ్యూజిక్ ఆల్బమ్స్, రియాల్టీ షోలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంటా లగా ఆల్బమ్ సమయంలో గాయకుడు, సంగీత దర్శకుడు హర్మీత్ సింగ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి పెళ్లికి దారితీసింది. 2004లో వీరి వివాహం జరగ్గా.. ఐదేళ్లు తిరిగేసరికి ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయింది. అనంతరం కెరీర్‌పై ఫోకస్ పెట్టిన షఫాలీ వ్యక్తిగత జీవితంలో కోలుకున్నారు.. ఈ దశలో నటుడు పరాగ్ త్యాగితో పరిచయం ఏర్పడి మరోసారి వైవాహిక బంధంలో అడుగుపెట్టారు.

Shefali Jariwala death case Police Officials suspect anti-ageing injection

మ్యూజిక్ ఆల్బమ్స్‌తో ఫేమ్
కాంటా లగాతో వచ్చిన గుర్తింపుతో రెండు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేశారు షఫాలీ. కాంటా లగా గర్ల్ అంటూ తనను ప్రజలు గుర్తు పెట్టుకోవడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. చివరి వరకు ప్రజలు నన్ను అలాగే గుర్తు పెట్టువాలని అనుకుంటున్నట్లు షఫాలీ తెలిపారు. చివరికి ఆమె అలాగే తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే షఫాలీ ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వీడియోలతో అభిమానులతో టచ్‌లో ఉండేవారు. ఏ చిన్న విషయంపై అయినా ఖచ్చితంగా స్పందించేవారు.

తారల ప్రాణాలు తీస్తోన్న యాంటీ ఏజింగ్
సినీతారలకు అందమే పెట్టుబడి అన్న సంగతి తెలిసిందే. వారు అంద చందాలు బాగున్నంత కాలమే కెరీర్.. ఆఫర్లు, నాలుగు కాలాల పాటు పాపులారిటీ ఉంటాయి. లేకపోతే మధ్యలోనే కెరీర్‌ను వదులు కోవాల్సిందే. అందుకే చాలామంది తమ వయసు పైబడకుండా, ప్రకృతి సిద్ధంగా శరీరంలో వచ్చే మార్పులను అడ్డుకోవడానికి సర్జరీలు, స్టెరాయిడ్స్, ఇంజెక్షన్స్ వంటివి తీసుకుంటున్నారు. పరిమితికి మించి వర్కవుట్స్, డైటింగ్‌లు చేయడంతో కొందరు హీరోయిన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు షఫాలీ మరణానికి కూడా యాంటీ ఏజింగ్ కారణమనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.

Take a Poll

ఖాళీ కడుపుతో ఆ ఇంజెక్షన్?
షఫాలీ చాలా ఏళ్లుగా యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. ఆమె నివాసంలో దీనికి సంబంధించిన మెడిసిన్స్, ఇంజెక్షన్లను సైతం స్వాధీనం చేసుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. షఫాలీ మరణించిన రోజున శుక్రవారం కావడంతో ఆమె ఇంట్లో పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారని, ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతోనే యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకోవడంతో కార్డియాక్ అరెస్ట్ జరిగి షఫాలీ మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఇంజెక్షన్ తీసుకున్న వెంటనే ఆమె వణికిపోయారని, ఒళ్లంతా చెమటలతో స్పృహతప్పి పడిపోయారని కథనాలు వస్తున్నాయి. ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే షఫాలీ ప్రాణాలు కోల్పోయారని డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో షఫాలీ మృతి కేసు పోలీసులకు చిక్కుముడిగా మారింది. దీంతో పోస్ట్‌మార్టం నివేదికపై ఆసక్తి నెలకొంది.

More from Filmibeat

Read more about: Shefali Jariwala movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X