శేఖర్ కమ్ముల 'లీడర్' కాపీ వివాదం
శేఖర్ కమ్ముల ప్రతిష్టాత్మకంగా రూపొందించిన లీడర్ చిత్రం తాజాగా కాపీ వివాదంలో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ మేరకు రైటర్స్ అశోషియేషన్ లో కంప్లైంట్ నమోదైందని తెలుస్తోంది. శివ అనే దర్శకత్వ విభాగానికి చెందిన వ్యక్తి ఒకరు లీడర్ కథ,తన కథ నుంచే వచ్చిందని పాతిక లక్షలు రూపాయలు చెల్లించాలని పట్టుబట్టినట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆ మేరకు అశోషియేషన్ వారు ఇరు పక్షాలను కూర్చోబెట్టినా ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల తాను రూపాయి కూడా ఇచ్చేది లేదని తెగేసి చెప్పినట్లు వినపడుతోంది. ఎందుకంటే తాను ఎంత కట్టినా కథా చౌర్యానికి పాల్పడినట్లేనని,తనకు కథను కాపీ కొట్టే అవసరం లేదని శేఖర్ వాదిస్తున్నారని చెప్తున్నారు. మరో ప్రక్క తెలంగాణ వివాదంతో అసలే లీడర్ రిలీజ్ లేటవుతుందనుకున్న నేపధ్యంలో ఈ వివాదం మరికొంత ఇబ్బంది కలిగించే అంశమే. ఈ చిత్రంతో ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు రాణా తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నాడు. ఇది సమకాలీన అంశాలతో కూడిన పొలిటికల్ ధ్రిల్లర్ అని చెప్తున్నారు. ఫ్రఖ్యాత సంస్ధ ఏవియం వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











