Don't Miss!
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ స్టార్ హీరోను మొదటిసారి డైరెక్ట్ చేయబోతున్న శేఖర్ కమ్ముల
ఫీల్ గుడ్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న టాలెంటెడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల స్లోగా స్టార్స్ సెలెక్షన్ విషయంలో అయితే చాలా మార్పులు చేస్తున్నాడు. వీలైనంత వరకు కొత్త నటీనటులను మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తు వస్తున్న శేఖర్ కమ్ముల మొదటిసారి బిగ్ స్టార్ హీరోను లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది.
యువ తార అక్షర గౌడ బ్యూటీఫుల్ గ్యాలరీ..
వరుణ్ తేజ్ తో ఫిదా లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం ఇప్పుడు నాగచైతన్యతో లవ్ స్టొరీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. శేఖర్ కమ్ముల ప్రేమ కథలు తీశాడు అంటే తప్పకుండా ఒక మ్యాజిక్ క్రియేట్ చేయగలడు. ఇక లవ్ స్టొరీ అనంతరం ఈ దర్శకుడు వెంకటేష్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు.
ఇంతవరకు శేఖర్ కమ్ముల అంత పెద్ద స్టార్ హీరోతో సినిమా చేయలేదు. దీంతో కమ్ముల మళ్ళీ ఏదో కొత్త సెన్సేషన్ కు తెరతీస్తున్నట్లు సమాచారం. ఇటీవల అరణ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా వెంకటేష్ కనపడగానే, మీతో సినిమా చేయాలని అనుకుంటున్నాను అంటూ శేఖర్ కమ్ముల ఒక కామెంట్ చేశాడు. త్వరలోనే స్క్రిప్ట్ పై వీరిద్దరి మధ్య చర్చలు జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక లవ్ స్టొరీ సినిమా ఏప్రిల్ 16న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.