శేఖర్ కమ్ముల బిగ్ బడ్జెట్ మూవీ.. మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా?
స్టార్ డైరెక్టర్ అనే ట్యాగ్ తో కాకుండా ఒక మంచి ఫీల్ గుడ్ డైరెక్టర్ అనేలా క్రేజ్ అందుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన ఎలాంటి సినిమాలు చేసినా కూడా మినిమామ్ హిట్ అనేలా థియేటర్స్ లో సందడి చేస్తాయి. ఒక సినిమా హిట్టవ్వగానే వెంటనే మరొక సినిమా స్టార్ట్ చేయకుండా బాగా ఆలోచించి నేటితరం జనరేషన్స్ ని ఆకట్టుకునేలా సినిమాలు తీయడంలో ఈ దర్శకుడు స్టైలే వేరు. ఇక నెక్స్ట్ ఒక స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది.

ఫిదా తరువాత..
చాలా రోజుల తరువాత ఫిదా సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల ఆ తరువాత న్యూ యాక్టర్స్ తో ఒక సినిమాను స్టార్ట్ చేశారు. కానీ ఆ సినిమా సరిగ్గా రాకపోవడంతో మధ్యలోనే ఆపేశారు. ఫిదా తరువాత శేఖర్ కమ్ముల బిగ్ బడ్జెట్ సినిమా చేయాలని ఒక ప్లాన్ వేసుకున్నారు. కానీ అనుకోని విధంగా వేరే సినిమా చేయాల్సి వచ్చింది.

లవ్ స్టోరీ..
నాగ చైతన్య - సాయి పల్లవిలతో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ అనే సినిమా చేశాడు. రిలీజ్ కి ముందే ఆ సినిమా ఓ వర్గం ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. లాక్ డౌన్ లేకుంటే ఈపాటికే రిలీజ్ అయ్యి ఉండేది. దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. సినిమా అవుట్ పుట్ పై పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

నెక్స్ట్ బిగ్ బడ్జెట్ మూవీ..
శేఖర్ కమ్ముల నెక్స్ట్ ఒక స్టార్ హీరోతో బిగ్ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ప్రొడక్షన్ లోనే సినిమాను రూపొందించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ స్టార్ హీరో ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు గాని మహేష్ బాబు అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి.
Recommended Video

మాట ఇచ్చిన మహేష్
శేఖర్ కమ్ముక మహేష్ బాబుతో ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అసలైతే ఫిదా సినిమా ఆయనతోనే చేయాలని అనుకున్నారు. కానీ తన స్టార్ ఇమేజ్ కి అలాంటి సినిమా సెట్టవ్వదని నో చెప్పేశారట. అయితే అప్పుడు మహేష్ శేఖర్ కమ్ములకు ఒక మాట ఇచ్చారట. తప్పకుండా మరొక మంచి కథతో వస్తే.. సినిమా చేద్దామని చెప్పడంతో ఇటీవల శేఖర్ కమ్ముల మహేష్ బాబుతో కథా చర్చలు జరిపినట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవతకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











