శేఖర్ కమ్ముల లిస్ట్ లో మరో యువ హీరో
టాలీవుడ్ ఫీల్ గుడ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న శేఖర్ కమ్ముల నెక్స్ట్ లవ్ స్టొరీ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన ఈ సినిమాపై ఆడియెన్స్ లో అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. ఏప్రిల్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
అయితే ఆ సినిమా తరువాత శేఖర్ కమ్ముల ఎవరితో వర్క్ చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. మొన్నటివరకు వెంకటేష్ తో చేసే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. అరణ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్ళినప్పుడు స్టేజ్ మీదే వెంకటేష్ తో త్వరలో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. కానీ ఇద్దరి మధ్య ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని సమాచారం.

అసలు మ్యాటర్ లోకి వస్తే మరో యువ హీరోతో కూడా శేఖర్ కమ్ముల చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు. వరుణ్ తేజ్. ఇదివరకే ఫిదా సినిమాతో హిట్ అందుకున్న ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని గాసిప్స్ అయితే వస్తున్నాయి. ఇక హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ అని టాక్ కూడా వస్తోంది. మరి ఈ గాసిప్స్ ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











