లవ్ స్టోరీ కోసం జక్కన్నలా మారిన శేఖర్ కమ్ముల!

అదేంటి శేఖర్ కమ్ముల జక్కన్నలా మారటం ఏమిటి అనుకుంటున్నారా, అవును నిజమే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా నటించిన లవ్ స్టోరీ సినిమా ఈ నెల 16న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా ముందే ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.. కోవిడ్ పరిస్థితులు అన్నీ చక్కబడ్డాక మళ్లీ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.. తమ సినిమా ఫ్యామిలీతో కలిసి వచ్చి చూసే సినిమా కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చిన తరువాత సినిమా రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు.. అయితే ఇప్పుడు గ్యాప్ వచ్చిన కారణంగా శేఖర్ కమల రాజమౌళి గా మారిపోయాడు. ఆ వివరాల్లోకి వెళితే

రష్మీ గౌతమ్.. చీరలో కూడా అదే హాట్ లుక్స్

ముందు కొత్తవాళ్లతో చేసి

ముందు కొత్తవాళ్లతో చేసి

ఫిదా సినిమా తర్వాత సుదేర్గ గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల ఈ సినిమా కంటే ముందు ఇదే స్టోరీతో కొత్తవాళ్లతో సినిమా షూటింగ్ చేశాడు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న సమయంలో సినిమా నచ్చని శేఖర్ కమ్ముల ఆ ప్రాజెక్ట్ ఆపేసి దాదాపు అదే స్టోరీతో నాగ చైతన్యతో తీశాడనే ప్రచారం ఉంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమా మొత్తం తెలంగాణ నేపద్యంలో తెరకెక్కించారు. హీరో హీరోయిన్ పాత్రలు తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఉంటాయి. నిజానికి గతంలో ఫిదా సినిమా కూడా తెలంగాణ నేపథ్యంలోనే తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల ఇప్పుడు ఈ సినిమా కూడా అదే నేపథ్యం కంటిన్యూ చేయడం గమనార్హం.

 నాలుగు రోజుల్లో విడుదల అనగా

నాలుగు రోజుల్లో విడుదల అనగా

అంతా పూర్తయిపోయి ఇంకా సినిమా నాలుగు రోజుల్లో రిలీజ్ ఉందనగా ఈ సినిమా వాయిదా వేయాల్సి వచ్చింది. అప్పటికే కరోనా కేసులు భారీగా నమోదవుతున్న కారణంగా థియేటర్ల విషయంలో ఆంక్షలు విధిస్తారు అని ముందుగా సినిమా నిర్మాతలు ఊహించి సరిగ్గా నాలుగు రోజులు ముందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తమ సినిమా ఫ్యామిలీతో కూర్చుని చూసే సినిమా కాబట్టి మళ్ళీ ఫ్యామిలీతో కూర్చుని చూసే పరిస్థితులు వచ్చాక రిలీజ్ చేస్తామని అప్పుడు చెప్పుకొచ్చారు..

వాయిదా వేయడమే కలిసొచ్చింది

వాయిదా వేయడమే కలిసొచ్చింది

అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా వాయిదా వేయడంతో ఇప్పుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను ట్రిమ్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. సాధారణంగా ఒకసారి సెన్సార్ అయిపోయిన తర్వాత సినిమాను మళ్లీ రీ షూట్ చేసే అవకాశం ఉండదు. అందుకే ఇప్పుడు ఉన్న దానిని ట్రిమ్ చేసే పనిలో ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే సినిమాని మొత్తం మళ్ళీ చూసి..దాదాపుగా ఓ పది నిమిషాల సినిమాని ట్రిమ్ చేసినట్టు ప్రచారం జారుతోంది. ఇప్పుడు లవ్ స్టోరీ సరిగ్గా సరిపోయిందని అంటున్నారు. సినిమా వాయిదా పడటంతోనే ఇలా చేసే అవకాశం దక్కిందని అంటున్నారు.

Recommended Video

Saranga Dariya 100 Million Views Record, ఆ ఇద్దరూ ప్రధాన కారణం!!
జక్కన్నలా మారి

జక్కన్నలా మారి

సాధారణంగా రాజమౌళి తన సినిమాలకు అదే పద్ధతి ఫాలో అవుతారు. లాస్ట్ మినిట్ దాకా అందులో ఏమేం మార్చచ్చో మారుస్తూ ఉంటారు. అందుకే ఆయన ఆ స్థాయిలో సక్సెస్ రేట్ ఉందని అంటూ ఉంటారు. దీంతో ఇప్పుడు అదే పద్దతిని శేఖర్ కమ్ముల కూడా ఫాలో అవుతున్నాడు అన్నమాట. మరి చూడాలి ఆయన లెక్కలు ఈయనకు కూడా కలిసి వచ్చి సినిమా సూపర్ హిట్ అవుతుందేమో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X