శేఖర్ కమ్ముల - ధనుష్ సినిమా స్టోరీపై సరికొత్త పుకార్లు.. నిజమేనా?
ఆనంద్ - హ్యాపీడేస్ - ఫిదా వంటి సినిమాలతో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న శేఖర్ కమ్ముల లీడర్ సినిమాతో తనలో కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చే దర్శకుడు ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. శేఖర్ కమ్ములను ఇష్టపడే వారు ఎక్కువగా లీడర్ సినిమానే గుర్తు చేస్తుంటారు. ఇక అలాంటి దర్శకుడు మొదటిసారి బార్డర్ దాటేసి కోలీవుడ్ హీరోను టచ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
నాగచైతన్య - సాయి పల్లవితో చేసిన లవ్ స్టొరీ సినిమా ఇప్పటికే విడుదలకు సిద్దంగా ఉంది. ఇక ధనుష్ తో చేయబోయే సినిమా ఎలా ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ఎనౌన్స్మెంట్ రాగానే అనేక రకాల కథనాలు కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఇక మెయిన్ కథ ఇదేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తమిళ రాజకీయాలకు సంబంధించిన రియల్ కథ ఆధారంగా కథను సేకరించినట్లు సమాచారం.

నేషనల్ వైడ్ గా ఉండే కామన్ సమస్యను సినిమాలో హైలెట్ చేస్తారని తెలుస్తోంది. దర్శకుడు శేఖర్ కమ్ముల కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెమ్యునరేషన్ లు కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. హీరో ధనుష్ కు దాదాపు 30కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్లు టాక్. ఇక సాయి పల్లవిని హీరోయిన్ గా ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఈ కథనాలు ఎంతవరకు నిజం అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











