ఒక్క ఛాన్స్.. పాపులర్ క్రికెటర్ బాలీవుడ్ ఎంట్రీ.. స్టార్ హీరోతో కలిసి డాషింగ్ ఓపెనర్!
సినిమాకి క్రికెట్‌కి చాలా దగ్గరి సంబంధం ఉంది. చాలా మంది క్రికెటర్లు సినీ తారలను పెళ్లి చేసుకున్నారు. కొంత మంది క్రికెట్ స్టార్లు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక సినిమాల్లోకి వచ్చారు. కొందరు సినిమాలు కూడా నిర్మించి ఇప్పటికీ చేస్తున్నారు. అందుకే సినీ పరిశ్రమకు, క్రికెటర్లకు చాలా సన్నిహిత బంధం ఉంది అంటారు. ఇదిలా ఉంటే క్రికెట్‌లో యాక్టివ్‌గా ఉంటూనే సినిమా రంగంలోకి రావాలనే కోరికను ప్రముఖ క్రికెట్ స్టార్ ఒకరు వ్యక్తం చేశారు. ఆయనెవరో ఓ లుక్కేద్దాం పదండి.
గంభీర్ తర్వాత భారత జట్టులో మంచి ఓపెనర్‌గా పేరు తెచ్చుకుని ఎన్నోసార్లు జట్టును గెలిపించిన ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ ఇప్పుడు సినిమా రంగంలోకి అడుగు పెట్టాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఇప్పటికీ ఐపీఎల్‌లో ఆడుతూ మంచి ప్రదర్శన కనబరుస్తున్న శిఖర్ ధావన్ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నాడు.

ఇప్పటికే జియో సినిమాస్‌లో షో ప్రారంభించి ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శిఖర్ ఇప్పుడు యాక్టింగ్ ను కూడా ట్రై చేయాలనుకుంటున్నాడు. 'ధావన్ కరేంగే' అనే టాక్ షో త్వరలో స్టార్ట్ కానుంది. ఈ టాక్ షోకి క్రికెట్, సినిమా పరిశ్రమల నుంచి చాలా మంది అతిథులను తీసుకురానున్నారు. ఇటీవలే అమీర్ ఖాన్ దర్శకత్వం వహించి, నటించనున్న 'సితారే జమీన్ పర్' సినిమా సెట్స్‌లో శిఖర్ ధావన్ కనిపించగా, ఈ సినిమాలో ధావన్ అమీర్ ఖాన్‌తో కలిసి నటిస్తాడనే వార్త ప్రచారంలోకి వచ్చింది.
ఈ సందర్భంగా ధావన్ మాట్లాడుతూ 'అమీర్ ఖాన్ నాకు అన్నయ్య లాంటి వాడు. అతనితో కాసేపు గడపాలని సెట్‌కి వెళ్లాను. ఒక్కసారి సినిమాలో నటించే అవకాశం వస్తే కచ్చితంగా వదలను. నాకు కెమెరా ముందు ఉండటమంటే ఇష్టం. ఇక ముందు మరిన్ని సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తాను" అని అన్నారు.
మీకు నటుడిగా మారాలనే కోరిక ఉందా ? అని అడగ్గా తనకు నటన గురించి పెద్దగా తెలియదని చెప్పాడు. కానీ తాను యాక్టింగ్ ను ఆనందిస్తానని వెల్లడించాడు. ధావన్ మాట్లాడుతూ "అఫ్ కోర్స్ నేను కెమెరా ముందు ఉండటాన్ని ఆస్వాదిస్తున్నాను. చాలా సంవత్సరాలుగా కమర్షియల్ యాడ్స్ చేస్తున్నాను. అయితే సినిమా చేయడం భిన్నమైన గేమ్.

నేను వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటున్నా. నా భవిష్యత్తు ఏమిటో చూడాలి అంటూ తనకు నటించాలి అని ఉందన్న కోరికను బయట పెట్టాడు. 2022లో హ్యూమా ఖురేషి నటించిన చిత్రం డబుల్ ఎక్స్‌ఎల్‌లో ధావన్ అతిధి పాత్ర నటించాడు. లాల్ సింగ్ చద్దా తర్వాత 2 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తీసుకున్న అమీర్ సితారే జమీన్ పర్ మూవీతో థియేటర్లలోకి రాబోతున్నాడు. జెనీలియా దేశ్‌ముఖ్ మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం 2024 క్రిస్మస్‌కు విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











