»   »  పాపం శిల్పాషెట్టి!!

పాపం శిల్పాషెట్టి!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
ప్రపంచ వ్యాప్తంగా శిల్పాషెట్టికి పేరు ప్రఖ్యాతులు వస్తుంటే భారత్ లో మాత్రం కష్టాలు ఎక్కువయ్యాయి. ఆ మధ్య మార్ఫింగ్ చేసి ఆమె పేరిట ఏకంగా అశ్లీల చిత్రాన్నే నెట్ లో పెట్టారు. దానికే తెగ ఇబ్బంది పడిన శిల్పాషెట్టి తాజాగా మరో ఇబ్బందిని ఎదుర్కుంటోంది. ఆమె అభిమాని ఒకరు ఆమె సెల్ ఫోన్ నంబర్ ను నెట్ లో పెట్టారు. జనాలు ఊరుకుంటారా...ఫోన్లు చేయడాలు ఎస్ఎంఎస్ లు పంపడం వీర లెవల్లో మొదలయింది. ఇందులో మంచి ఎస్ఎంఎస్ లూ ఉన్నప్పటికీ చెడువే అధిక సంఖ్యలో ఉండడంతో శిల్పాషెట్టి తల పట్టుకుందట. ఇది తట్టుకోలేక ముంబైలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందిట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X