శిల్పాశెట్టి లాగా పిచ్చి ముదిరి పాకాన పడితే ముంజేతికి తాళి కడతారు!
ఒక్కొక్కరూ ఒక్కోదానికి పాపులర్ అవుతారు, వార్తల్లో నిలుస్తారు. కానీ ఒక వ్యక్తి ఏం చేసినా వార్తల్లో నిలుస్తుంటే ..ఆ వ్యక్తిని శిల్పాశెట్టి అనాలేమో? రియాలిటీ షోలల్లో పాల్గొని ఒకసారి, తాను ప్రాక్టీస్ చేసిన యోగాని డివిడిల రూపంలో విడుదల చేసి మరోసారి..ఇలా రక రకాలుగా ఎప్పుడూ వార్తల్లో ఉండే వ్యక్తి ఈ పొడుగు కాళ్ళ సుందరి శిల్పాశెట్టి. తాజాగా మరో ఉదంతంతో ప్రపంచాన్ని తన వైపుకి తిప్పుకుంది ఈ బాలీవుడ్ భామ.
రాజ్ కుంద్రాని పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా, రకరకాల వృత్తిగత, వ్యక్తిగత వ్యాపకాలతో తీరుబడి లేకుండా ఉంది శిల్పా. ఎందుకనో తెలియదు కానీ, తన మెడలో ఉండాల్సిన మంగళ సూత్రాన్ని ముంజేతి చుట్టూ కట్టుకొని ఒక సందర్భంలో కనిపించింది. ఒక రియాలిటీ షోలో ఇలా కనిపించిన శిల్పా అందరి దృష్టిని ఆకర్షించింది. దీన్ని స్సూర్తిగా తీసుకొని ఇంకొందరు పెళ్ళైన పడుచులు శిల్పాని అనుసరిస్తే ఆశ్చర్యపోవాల్సిన పనేంలేదు. ముందు ముందు ఈ పిచ్చి ముదిరి పాకాన పడితే, పెళ్లి సమయంలో అబ్బాయిలందరూ అమ్మాయిల మెడలో బదులు, ముంజేతికే తాళి కట్టే పరిస్థితి రావచ్చునేమో? ఇక అప్పుడు అందరూ ఈ సాంప్రదాయానికి ఆద్యురాలు శిల్పే అని ఆమె నామ జపం చేస్తారేమో?


Click it and Unblock the Notifications











