ఆ హీరోయిన్ గర్భవతా..?
బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి ఈ మధ్య చాలా సంతోషంగా, ఆమె ముఖంలో అంతుపట్టలేని ఆనందంతో కనిపిస్తోంది. అయితే విషయం ఏమిటి? అని అడిగితే మాత్రం ఏమీ లేదంటూ దాట వేత ధోరణి ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె గర్భంతో ఉందనే ప్రచారం బాలీవుడ్ లో జరుగుతోంది. శిల్పా, ఆమె భర్త రాజ్ కుంద్రా కావాలనే ఈ విషయాన్ని దాస్తున్నారని అంటున్నారు. గతంలో శిల్పా శెట్టి గర్భం ధరించినప్పటికీ గర్భస్రావం కావడంతో అది నిలవలేదు. ఈ నేపథ్యంలో ఈ సారి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారని అంటున్నారు. శిల్పా తన స్నేహితులతో ఈ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. భర్త రాజ్ కుంద్రా శిల్పాను ప్రస్తుతం దగ్గరుండి చూసుకుంటున్నాడని, ఎప్పటికప్పడు వైద్య పరీక్షలు చేయిస్తూ....ఈ సారి ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. తల్లి కావాలని ఉవ్విల్లూరుతున్న శిల్పా తాపత్రయం ఈ సారైనా ఫలించాలని అభిమానులుకు కూడా కోరుకుంటున్నారు.
ఇక పోతే...బాలీవుడ్ తారలంతా వరుస పెట్టి అమ్మానాన్నలు అవుతుండటం పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఐశ్వర్య-అభిషేక్, అమీర్ ఖాన్-కిరణ్ రావు దంపతులు అమ్మనాన్నలయ్యారు. సెలీనా జైట్లీ, లారా దత్తలు ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడేమో శిల్పా శెట్టి.


Click it and Unblock the Notifications












