20 ఏళ్ళ తరువాత తెలుగు తెరపై సాగర కన్య.. బోల్డ్ పాత్ర కోసం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్స్ అందుకొని ఆ తరువాత బాలీవుడ్ బాట పట్టిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అప్పట్లో టాలీవుడ్ సినిమా అంటే బాలీవుడ్ హీరోయిన్స్ కాస్త చిన్న చూపుతో చూసేవారు. కానీ కొంతమంది బాలీవుడ్ బ్యూటీలు ఇప్పటికి కూడా తెలుగు సినిమాలంటే రెడీగా ఉంటారు. అందులో శిల్పా శెట్టి ఒకరు. ఈ బ్యూటీ 20 ఏళ్ల తరువాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video

ఆ సినిమాలతో..
శిల్పా శెట్టి హిందీ సినిమాలతో బిజీగా ఉన్న సనయంలోనే తెలుగు నుంచి ఆఫర్స్ వస్తే చేయడానికి సిద్ధమైంది. వెంకటేష్ సాహస వీరుడు సాగర కన్య సినిమాతో అమ్మడి మంచి క్రేజ్ వచ్చింది. సాగర కన్య అనే ఒక ట్యాగ్ క్రియేట్ చేసుకుంది. అలాగే నాగార్జున ఆజాద్, బాలకృష్ణ భలే వాడివి బసు(2001) సినిమాల్లో నటించింది. ఆ తరువాత బాలీవుడ్ లో క్రేజ్ పెరగడంతో తెలుగులో ఆఫర్స్ తగ్గాయి.

డేట్స్ అడ్జస్ట్ చేయలేక..
కొన్ని సందర్బల్లో వచ్చినా కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది. ఇక ఫైనల్ గా 20 ఏళ్ళ తరువాత శిల్పా శెట్టి ఒక తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నితిన్ బాలీవుడ్ మూవీ అందాదున్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. హిందీలో టబు చేసిన బోల్డ్ పాత్ర కోసం చిత్ర యూనిట్ ఈ సీనియర్ బ్యూటీని సంప్రదించారట.

నితిన్ సినిమాలో..
నితిన్ తెలుగు అందాదున్ లో ఇంతకుముందు రమ్యకృష్ణని కుడా అనుకున్నట్లు టాక్ వచ్చింది. కానీ ఫైనల్ గా దర్శకుడు మేర్లపాక గాంధీ శిల్పా శెట్టిని ఫైనల్ చేసినట్లు టాక్ వస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక శిల్పా శెట్టి ఆ రోల్ చేస్తుందా లేదా అనే విషయంపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఒకవేళ అది నిజమే అయితే శిల్పా శెట్టి 20 ఏళ్ల తరువాత తెలుగు ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

రిజెక్ట్ చేసిన కీర్తి సురేష్..
ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా చాలా కీలకం కావడంతో మంచి స్టార్ ఇమేజ్ ఉన్న హోమ్లీ హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారు. అయితే హీరోయిన్ లిప్ లాక్ సీన్స్ ఉంటాయని కీర్తి సురేష్ ఈ సినిమాలో నటించే ఆఫర్ వచ్చినప్పటికీ రిజెక్ట్ చేసిందట. దీంతో చిత్ర యూనిట్ మరొక హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తోంది. నితిన్ హోమ్ ప్రొడక్షన్ శ్రేష్ట్ మూవీస్ ఈ సినిమాను నిర్మించనుంది.


Click it and Unblock the Notifications











