తాళి మెడలోకాదు ఇక్కడ ఉండాలంటున్న హీరోయిన్..!
హిందూ మతంలో తాళిబొట్టుకి చాలా విలువుంది. ఒకసారి కట్టినట్టయితే దాన్ని తీసివెయ్యటానికి మన సాంప్రదాయం ఒప్పుకోదు. ఈ సెంటిమెంటు చాలా సినిమాల్లో ఎన్నో సన్నివేశాలలో కూడా మనం చూడవచ్చు. విలన్ తాళి కట్టబోతుంటే అడ్డుకోవటం, లేదా పెళ్ళికి అడ్డు పెట్టేవారు వస్తుంటే గబగబా తాళి కట్టెయ్యటం లాంటి దృశ్యాలు ఎన్నో తెరకెక్కాయి. పురాణాల్లో కూడా పతివ్రతలను వారి మెడలోని తాళి బొట్టు కాపాడిన ఉదంతాలు కనిపిస్తాయి. మరి అయితే ఈ సెలబ్రిటి పవిత్రత ఎంతో చూడండి.....
కొత్త ట్రెండ్, న్యూ జనరేషన్ అంటూ హీరోయిన్లు, హీరోలు ఏం చేసినా చెల్లిపోతుందనడానికి ఉదాహరణ. సాంప్రదాయాలని స్టయిల్ పేరిట తుంగలో తొక్కేసే సెలబ్రిటీస్ ఆఖరుకి తాళిబొట్టుకి కూడా స్టయిల్ నేర్పిస్తున్నారు. బాలీవుడ్ స్టయిల్ లేడీ శిల్పాశెట్టి తన మంగళసూత్రాన్ని ఎక్కడ ధరించి తిరుగుతోందో చూడండి. చేతికి బ్రేస్ లెట్ లా మంగళసూత్రం వేసుకు తిరుగుతున్న శిల్ప ఇప్పటికే పలువురి ప్రభావితం చేసింది.
అసలు మంగళసూత్రం మెడలోనే ఎందుకు వేసుకుంటారనే దానిపై మన పెద్దలు చాలా సంగతులే చెప్తారు. కానీ శిల్ప మాత్రం అదేమీ పట్టనట్టు తాళిని తీసుకెళ్లిచేతికి కట్టుకుని తిరుగుతోంది. ఫ్యాషన్ వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో ఇక శిల్పని ఫాలో అవుతూ మరింత మంది తాళిని చేతికి కట్టుకు తిరిగే రోజు దగ్గర్లోనే ఉంది.


Click it and Unblock the Notifications











