నందమూరి హీరోల పాలిట విలన్‌గా చిన్న నంబీ.. ఎన్టీఆర్ తర్వాత బాలయ్యే టార్గెట్
వరుసగా 'అఖండ', 'వీర సింహా రెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుని ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ ఉత్సాహంలోనే ఆయన మరిన్ని కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇలా ఇప్పుడు ఈ సీనియర్ స్టార్ హీరో.. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాను చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం 1980 దశకం నాటి కథతో రూపొందబోతున్నట్లు ఇటీవలే వచ్చిన పోస్టర్ల ద్వారా అర్థం అయింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో పెరగ్గా.. దీనికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను తీస్తున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో బాలయ్య మేకోవర్ డిఫరెంట్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

యాక్షన్ అండ్ డ్రామాతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్‌తో పాటు చాలా ప్రాంతాలకు వెళ్లి మరీ చిత్రీకరణ జరిపింది. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొనసాగుతున్నట్లు తెలిసింది.
బాలయ్య - బాబీ కలిసి చేస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా ఎవరు నటిస్తారన్న దానిపై ఎన్నో రకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ ఆ పాత్రను చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మరో విలన్ పాత్ర కూడా ఉన్నట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

బాలయ్య సినిమాలో సెకెండ్ విలన్ పాత్ర కోసం దసరా మూవీ ఫేం షైన్ టామ్ చాకోను తీసుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఈయన ఇందులో ఓ డిఫరెంట్ నెగెటివ్ రోల్‌ను చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా బాలయ్య - షైన్ టామ్ చాకో మధ్యన వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా ఉండబోతున్నాయట. ఇదిలా ఉండగా.. ఈ మలయాళ నటుడు ఇప్పటికే 'దేవర'లో విలన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా నందమూరి హీరోలకు అతడు విలన్‌గా మారిపోయాడు.
ఇదిలా ఉండగా.. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో శ్రద్దా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











