ప్రభాస్‌కు చుక్కలు చూపిస్తున్న చిన్న నంబీ.. ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో కంటే ఇప్పుడు సీక్వెల్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. ఒకప్పుడు ఏదైనా ఒక సినిమా విజయం సాధిస్తేనే దానికి కొనసాగింపుగా మరో దాన్ని తెరకెక్కించేవారు. కానీ, ఇప్పుడు మాత్రం మొదట్లోనే ఫలానా సినిమాను రెండు పార్టులుగా తీస్తామని అంటున్నారు. ఇలా ఇప్పుడు తెరకెక్కుతోన్న సిరీస్‌లలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'సలార్' ఒకటి.
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమానే 'సలార్: సీజ్‌ఫైర్'. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. అదే సమయంలో ప్రభాస్‌ను మరోసారి హిట్ ట్రాక్ ఎక్కించింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న 'సలార్: శౌర్యాంగ పర్వం'పై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.

'సలార్: సీజ్‌ఫైర్' సూపర్ హిట్ అవడంతో దీనికి కొనసాగింపుగా 'సలార్: శౌర్వాంగ పర్వం' మూవీని రూపొందిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను సైతం మొదలు పెట్టారు. ఇందులో ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లుగానే దీన్ని షురూ చేస్తున్నారు.
రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'సలార్: శౌర్యాంగ పర్వం' మూవీకి సంబంధించి ఎన్నో రకాల విషయాలు లీక్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో మరికొందరు పాన్ ఇండియా రేంజ్ ఆర్టిస్టులను నటిస్తున్నారని అంటున్నారు. ఇలా ఇప్పటికే పలువురిని ప్రశాంత్ నీల్ ఎంపిక చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మలయాళ నటుడు షైన్ టామ్ చాకోను తీసుకున్నారు.

హై రేంజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'సలార్: శౌర్యాంగ పర్వం' మూవీలో 'దసరా' ఫేం షైన్ టామ్ చాకో కీలక పాత్రను చేస్తున్నట్లు తెలిసింది. అతడి పాత్ర ప్రభాస్‌కు అపోజిట్‌గా ఉండబోతుందని అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే విలన్ గ్యాంగ్‌లోనే చాకో కనిపిస్తాడట. తాజా షెడ్యూల్‌లో అతడు భాగం అయినట్లు కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
ఇదిలా ఉండగా.. 'సలార్ 2' చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా చేస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. శ్రీయా రెడ్డి, బాబీ సింహా, ఈశ్వరీ రావు, బ్రహ్మాజీ తదితరులు ఇందులో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











