రాజశేఖర్ కూతుర్ల విషయంలో... అనుకున్నదొక్కటి, అయింది మరొకటి!

జీవిత రాజశేఖర్ దంపతుల ఇద్దరు కూతుళ్లలో మొదట ప్రకటన వచ్చింది పెద్ద కూతురు శివాని గురించే.... బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన '2 స్టేట్స్' తెలుగు రీమేక్ ద్వారా ఆమెను హీరోయిన్‌గా లాంచ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఇందులో అడవి శేష్ హీరోగా ఎంపికయ్యాడు. అయితే కొన్ని లీగల్ సమస్యల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

ఈలోగా అనుకోకుండా రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మికకు సినిమా ఆఫర్ రావడం, 'దొరసాని' ద్వారా ఆమె లాంచ్ అవ్వడం తెలిసిందే. ఇలా మొదట పెద్ద కూతురు అనుకుంటే చిన్న కూతురు తెరంగ్రేటం చేసింది. అలా జీవిత రాజశేఖర్ దంపతులు ఒకటి అనుకుంటే.. జరిగింది మరొకటి.

Recommended Video

Netizen Fires On Hero Rajasekhar & Hyderabad Police, Rajasekhar Replies To Her Post || Filmibeat
శివానీ తెరంగ్రేటం చేయబోయే సినిమా ఖరారైందా?

శివానీ తెరంగ్రేటం చేయబోయే సినిమా ఖరారైందా?

తాజా సమాచారం ప్రకారం రాజశేఖర్ పెద్ద కూతురు శివాని తెరంగ్రేటం చేసే సినిమా ఖరారైనట్లు తెలుస్తోంది. రొమాంటిక్ సైంటిఫిక్ మూవీ ద్వారా ఆమె తెరంగ్రేటం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... రాజశేఖర్ ‘కల్కి' చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ శివానీ నటించబోయే ఈ ప్రాజెక్ట్‌కు కథ అందించినట్లు సమాచారం.

హీరోగా ఎవరంటే..?

హీరోగా ఎవరంటే..?

ఈ చిత్రంలో తేజ సజ్జ హీరోగా నటించబోతుననట్లు సమాచారం. ఒకప్పుడు చూడాలని ఉంది, ఇంద్ర, ఠాగూర్ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించిన తేజా సజ్జా... ఇటీవల విడుదలైన సమంత మూవీ ‘ఓ బేబీ'లో కీలకపాత్రలో నటించాడు.

దర్శకుడు అతడే అంటూ ప్రచారం

దర్శకుడు అతడే అంటూ ప్రచారం

ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కేవలం కథ మాత్రమే అందించారని.... మల్లిక్ రామ్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. మల్లిక్ రామ్ గతంలో సుమంత్ నటించిన ‘నరుడా డోనరుడా' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ గురించి అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది.

శివానీపై జీవితరాజశేఖర్ దంపతుల ఆశలు

శివానీపై జీవితరాజశేఖర్ దంపతుల ఆశలు

చిన్న కూతురు శివాత్మిక నటించిన ‘దొరసాని' మూవీ ఇటీవల విడుదలైంది. ఇందులో ఆమె నటనకు మంచి పేరు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ దంపతులు తమ పెద్ద కూతురు శివానీ చేయబోయే సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X