నిజమేనా? నిర్మాత కుమారుడితో రాజశేఖర్ కూతురు!
రాజశేఖర్ కూతురు తెరంగ్రేటానికి అంతా సిద్ధమైంది. ఆమె తొలి సినిమా శివ కందుకూరితో చేయబోతోంది.
టాలీవుడ్ సెలబ్రిటీలు రాజశేఖర్, జీవిత ముద్దుల కుమార్తె శివాని త్వరలో హీరోయిన్‌గా తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై రాజశేఖర్ ఫ్యామిలీ నుండి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఆమె తొలిసారి నటించబోయేది ఏ హీరోతో? ఎలాంటి సినిమా చేయబోతున్నారు అనేది ఇంకా ఖరారు కాలేదు.
రాజశేఖర్ కూతురు తెరంగ్రేటానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్లో ప్రచారంలోకి వచ్చింది. నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు హీరోగా పరిచయం అయ్యే సినిమాలో శివాని హీరోయిన్‌గా నటించబోతోందని సమాచారం.

రాజ్ కందుకూరి
2016 సంవత్సరంలో ‘పెళ్లి చూపులు' సినిమా ద్వారా భారీ విజయాన్ని అందుకున్న రాజ్ కందుకూరి త్వరలో తన కుమారుడు శివను హీరోగా పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Recommended Video


శివ కందురూరి
శివ కందుకూరి ప్రస్తుతం అమెరికా పెన్సిల్వేనియాలోని పెన్ స్టేట్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ ఏడాది అతడి చదువు పూర్తవుతుందని, 2018లో శివ, శివాని ఇద్దరినీ పరిచయం చేస్తూ సినిమా ప్రారంభం కాబోతోందని సమాచారం.

శివానీ
తల్లితండ్రుల నట వారసత్వాన్ని అంది పుచ్చుకున్న ఈ భామ ఇటీవల చేసిన ఒక ఫోటోషూట్ చాలా మంది అగ్ర దర్శకుల దృష్టిని ఆకర్షించింది. కంటెంట్, బ్రాండ్ బిల్డింగ్, ఫిలిం యాక్విజిషన్ మరియు ఇంటిగ్రేషన్, స్పోర్ట్స్, మ్యూజిక్ వంటి రంగాలలో ప్రవేశమున్న భారతదేశంలోనే అతి పెద్ద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ‘క్వాన్'తో శివానీ టై అప్ అయింది.

శివాని
కళలు, డాన్స్, మార్షల్ ఆర్ట్స్ లో మెలుకువలు నేర్చుకుంటూనే, మెడిసిన్ కూడా చదువుతోంది శివాని.


Click it and Unblock the Notifications











