రాజశేఖర్ కూతురికి మరో ఆఫర్.. 'దొరసాని' గ్లామర్ రోల్
జీవిత రాజశేఖర్ కుమార్తె శివాత్మిక 'దొరసాని' సినిమా ద్వారా వెండితెరపై కాలుమోపనున్న సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే శివాత్మిక మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌లో దొరసానిగా శివాత్మిక లుక్స్ బాగా అట్రాక్ట్ చేయడంతో ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి కంబరుస్తున్నారట దర్శకనిర్మాతలు.
ఈ మేరకు గతంలో వచ్చిన కుమార్ 21ఎఫ్ సినిమాకు సీక్వల్‌గా రాబోతున్న సినిమాలో శివాత్మికను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయట. సీనియర్ దర్శకుడు సుకుమార్ సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బ్యానర్ పై కుమార్ 21ఎఫ్ సినిమాను నిర్మించారు సుకుమార్. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ కొట్టేసింది. గ్లామర్ రోల్ కావడంతో ఆమె పాత్రకు యూత్ ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అయ్యారు.

అయితే ఈ సినిమాకు సీక్వల్ ప్లాన్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు. ఈ మేరకు డైరెక్టర్ ప్రతాప్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశారట. అయితే కథ ప్రకారం ఇందులో హీరోయిన్ గా శివాత్మిక అయితే బాగుంటుందని ఆయన భావిస్తున్నాడట. త్వరలోనే ఆమెను సంప్రదించి కథ వినిపిస్తారట ప్రతాప్. ఈ ఆఫర్ గనక శివాత్మిక ఓకే చేసిందంటే.. ఆమె కెరీర్ లో టర్నింగ్ మూవీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని విశ్లేషణలు సాగుతున్నాయి.
మరోవైపు శివాత్మిక తాజా సినిమా 'దొరసాని' పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. పైగా ఈ చిత్రంతోనే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినీ గడప తొక్కడం, అదే విధంగా రాజశేఖర్ కూతురు శివాత్మిక టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం ప్రేక్షకలోకంలో ఆసక్తికర అంశంగా మారింది. జులై 12 వ తేదీన 'దొరసాని' ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











