షాకింగ్: రాహుల్ సిప్లీగంజ్‌తో స్టార్ హీరో డాటర్ రొమాన్స్.. ఆ డైరెక్టరే వీళ్లిద్దరినీ కలిపాడట.!

By Manoj

ఒకే ఒక్క షోతో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లీగంజ్. ఇటీవల ముగిసిన బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ -3లో విన్నర్‌గా నిలిచిన అతడు.. ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. దానిని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నాడు. వాస్తవానికి గతంలో సింగర్‌గా ఎంతో పేరు దక్కించుకున్న రాహుల్.. బిగ్ బాస్ తర్వాత దానిని రెట్టింపు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రాహుల్ గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే...

 ఆమె రాహుల్‌ను నిలబెట్టింది

ఆమె రాహుల్‌ను నిలబెట్టింది

రాహుల్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు పునర్నవితో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. దాని వల్ల ప్రేక్షకుల దృష్టిలో పడిపోయాడు. దీనికితోడు కొన్ని సంఘటనలు కూడా అతడికి ప్లస్ అయ్యాయి. ఇక, పున్నూ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాహుల్ గెలుపు కోసం కొన్ని ప్రయత్నాలు చేసింది. మొత్తంగా రాహుల్ విజయం వెనుక ఆమె పాత్ర ఎంతో ఉంది.

గెలిపించిన ఫ్యాన్స్ కోసం సరికొత్తగా

గెలిపించిన ఫ్యాన్స్ కోసం సరికొత్తగా

తనను బిగ్ బాస్‌లో గెలిపించిన ఫ్యాన్స్ కోసం రాహుల్ సరికొత్త అడుగులు వేశాడు. గతంలో ఎవరూ చేయని విధంగా ఈ టాలెంటెడ్ సింగర్.. ఓ ఈవెంట్‌ను నిర్వహించాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు ఫ్రీ ఎంట్రీ ఇచ్చి తన ఫ్యాన్స్‌ రుణం తీర్చుకునే ప్రయత్నం చేశాడు. అలాగే.. సోషల్ మీడియా ద్వారా తరచూ ఏదో ఒక విధంగా ధన్యవాదాలు తెలుపుతూనే ఉన్నాడు.

అప్పుడు ప్రదర్శనలు.. ఇప్పుడు గెస్ట్ రోల్స్

అప్పుడు ప్రదర్శనలు.. ఇప్పుడు గెస్ట్ రోల్స్

గతంలో ఏదైనా సినిమా ఫంక్షన్ జరిగితే రాహుల్ సిప్లీగంజ్ స్టేజ్‌పై ప్రదర్శనలు ఇచ్చేవాడు. తాను పాడిన సినిమా అయినా అవ్వకున్నా నిర్వహకులు కబురు పెడితే వచ్చేసేవాడు. అయితే, బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత మాత్రం అతడి స్టేటస్ మారిపోయింది. ఈ మధ్య కొన్ని సినిమా ఫంక్షన్లకు రాహుల్.. ముఖ్య అతిథిగా విచ్చేయడం విశేషం.

 రాహుల్‌కు బడా ఆఫర్.. ఎవరూ ఊహించలేదు

రాహుల్‌కు బడా ఆఫర్.. ఎవరూ ఊహించలేదు

ఇప్పటి వరకు సింగర్‌గా ఎన్నో చిత్రాలకు పని చేసిన రాహుల్.. ఇకపై యాక్టర్‌గానూ మెప్పించాలనుకుంటున్నట్లు గతంలో ప్రకటించాడు. అందుకు అనుగుణంగానే సీనియర్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తండ' అనే సినిమాలో ఛాన్స్ పట్టేశాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ప్రకటించాడు. అంతేకాదు, తనకు మద్దతు, ఆశీర్వాదాలు కావాలని కోరాడు.

స్టార్ హీరో డాటర్‌తో రాహుల్ రొమాన్స్

స్టార్ హీరో డాటర్‌తో రాహుల్ రొమాన్స్

ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రాహుల్‌కు జంటగా జీవితా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక నటిస్తోందట. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారనే టాక్ వినిపిస్తోంది. ఈమె గతంలో ‘దొరసాని' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
అసలేంటీ ‘రంగమార్తండ'.?

అసలేంటీ ‘రంగమార్తండ'.?


మరాఠిలో ఘన విజయం సాధించిన చిత్రం ‘నట సామ్రాట్‌' బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో ‘రంగమార్తండ' టైటిల్‌తో రీమేక్‌ చేస్తున్నాడు కృష్ణవంశీ. ఇందులో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X