మహేష్ బాబు చిత్రంలో మాజీ హీరోయిన్ శోభన
ప్రస్తుతం మహేష్ బాబు... సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్. ఈ చిత్రాన్ని దసరా కానుకగా తేవాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పండుగ రోజున విడుదల అయ్యేలా చూడాలని, అప్పటికి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
ఇక గతంలో మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మాతలు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. గచ్చిబౌలీ దగ్గరలోని ఫ్యాక్టరీలో యాక్షన్ సన్నివేసాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్ కోసం ఓ ప్రత్యేకమైన సెట్ ని నిర్మించారు.
సల్మాన్ ఖాన్ 'ఏక్ థా టైగర్' సినిమాకి పని చేసిన ఫైట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్ గా కనిపించనున్నారు. అందుకోసం దర్శకుడు కొత్తలుక్ తో ప్రెజెంట్ చేస్తున్నారు. మొదటినుంచీ మహేష్ బాబు తన హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, బాడీ లాంగ్వేజ్ దాకా ప్రతీ చిత్రంలోనూ ఢిఫెరెంట్ గా చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా పోకిరి నుంచి ఆయన పూర్తిగా ఢిఫెరెంట్ లుక్ తో కనిపిస్తూ వస్తున్నారు.
ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక వివరాల్లోకి వెళితే... ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ -స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.


Click it and Unblock the Notifications












