గాడ్ ఫాదర్‌లో చిరంజీవి చెల్లెలిగా సీనియర్ హీరోయిన్: ఆ రెండు సినిమాల్లో జోడీగా ఇప్పుడిలా!

సుదీర్ఘ కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అదే గ్రేస్‌, అదే ఫాలోయింగ్‌తో సత్తా చాటుతోన్న ఆయన.. ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాలో నటిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి.. ఇది పూర్తి కాకముందే మరో మూడు ప్రాజెక్టులను ప్రకటించి అందరికీ షాకిచ్చారు. దీంతో ఆయన ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'గాడ్ ఫాదర్' ఒకటి. సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ మలయాళంలో తెరకెక్కించిన చిత్రం 'లూసీఫర్'. ఈ సినిమా తెలుగు సహా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని చోట్లా దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దీన్నే 'గాడ్ ఫాదర్'గా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయిపోయింది.

Shobana Chiranjeevi Sister Role in God Father Movie

మోహన్ లాల్ హీరోగా నటించిన 'లూసీఫర్'లో అసలు హీరోయిన్ పాత్రే ఉండదు. అయితే, తెలుగు నేటివిటీకిఅనుగుణంగా చిరంజీవి చేసే సినిమాలో ఆ రోల్‌ను యాడ్ చేశాడు దర్శకుడు మోహన్ రాజా. ఇక, ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్‌ను తీసుకుంటున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ సమయంలోనే ఈ ప్రతిష్టాత్మక సినిమాలో నటించేందుకు లేడీ సూపర్ స్టార్ నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ నడిచింది. కొద్ది రోజులకు ఆమె చేసేది చిరంజీవి చెల్లెలి పాత్ర అన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో అందరిలో అయోమయం నెలకొంది.

తాజా సమాచారం ప్రకారం.. 'గాడ్ ఫాదర్' మూవీలో అత్యంత ముఖ్యమైన హీరో చెల్లెలి పాత్రను సీనియర్ హీరోయిన్ శోభన చేస్తుందట. ఇప్పటికే దీనికి సంబంధించి ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందనే టాక్ వినిపిస్తోంది. చాలా కాలంగా శోభన తెలుగు తెరకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'గాడ్ ఫాదర్' మూవీతో ఆమె రీఎంట్రీ ఇస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా.. గతంలో ఎన్నో తెలుగు చిత్రాల్లో శోభన హీరోయిన్‌గా నటించారు. ఈ క్రమంలోనే చిరంజీవితో కలిసి 'రుద్రవీణ', 'రౌడీ అల్లుడు' వంటి చిత్రాలు చేశారు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడామె రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.

పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో సాగే 'గాడ్ ఫాదర్' సినిమాలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా నటిస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి ఆ టైటిల్ పెట్టారు. ఇక, ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తోంది. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. థమన్ సంగీతం అందించబోతున్నాడు. సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X