SSMB28: మహేశ్ బాబు తల్లిగా స్టార్ హీరోయిన్.. గురూజీ సంచలన నిర్ణయంతో కోట్ల నష్టం?

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ బడా హీరోగా వెలుగొందుతోన్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. మరీ ముఖ్యంగా కొంత కాలంగా సత్ఫలితాలు వస్తుండడంతో అతడు రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తోనూ ఓ క్రేజీ ప్రాజెక్టును చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన వివరాలివే!

 సక్సెస్ ట్రాక్.. అది మాత్రమే

సక్సెస్ ట్రాక్.. అది మాత్రమే

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలి కాలంలో 'భరత్ అనే నేను' నుంచి వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ హిట్లు తన ఖాతాలో వేసుకుని హవాను చూపించాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాయి. అయితే, ఈ ఏడాది వచ్చిన 'సర్కారు వారి పాట' మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. దీంతో ఇది నిరాశనే మిగిల్చింది.

త్రివిక్రమ్‌తో మహేశ్ మరోటి

త్రివిక్రమ్‌తో మహేశ్ మరోటి

హిట్లు ఫ్లాపులను చూడకుండా సినిమాలు చేస్తోన్న మహేశ్ బాబు.. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై అంచనాలున్నాయి.

యాక్షన్ ఇంట్రో కంప్లీట్‌గానే

యాక్షన్ ఇంట్రో కంప్లీట్‌గానే

సుదీర్ఘ విరామం తర్వత మహేశ్, త్రివిక్రమ్ కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. అంతేకాదు, ఫస్ట్ షెడ్యూల్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబుపై అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను, ఇంట్లో ఫైట్‌ను చిత్రీకరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను వదిలిన యూనిట్.. బజ్ మరింత పెంచింది.

కొత్త షెడ్యూల్.. కొత్త న్యూస్

కొత్త షెడ్యూల్.. కొత్త న్యూస్

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను డిసెంబర్ మొదటి వారం నుంచి షురూ చేయబోతున్నారని ఇటీవలే ఓ న్యూస్ లీకైంది. కానీ, ఇటీవలే మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. దీంతో ఈ సినిమా ఆలస్యం అవ్వొచ్చని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా కథను గురూజీ మార్చేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది.

స్క్రిప్టు మార్చేది అందుకేనా

స్క్రిప్టు మార్చేది అందుకేనా

మహేశ్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టును మార్చుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించేందుకే గురూజీ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీంతో ఫస్ట్ షెడ్యూల్‌లో చేసిన షూట్ మొత్తం వేస్ట్ అయిపోయిందని, దీనివల్ల యూనిట్‌కు కొన్ని కోట్ల నష్టం వచ్చిందని కూడా టాక్ వినిపిస్తోంది.

సూపర్ స్టార్ తల్లిగా శోభన

సూపర్ స్టార్ తల్లిగా శోభన

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని వైవిధ్యమైన కథతో రూపొందిస్తున్నారట. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ శోభన.. మహేశ్ బాబు తల్లిగా నటిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X