సమంతకు షాకిచ్చిన నాగ చైతన్య.. మరొకరి ఎంట్రీతో ఆమెను పక్కన పెట్టేస్తున్నాడు.!
టాలీవుడ్‌లో మోస్ట్ ఫేమస్ కపుల్స్‌లో అక్కినేని నాగ చైతన్య.. సమంత జంట ఒకటి. దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన 'ఏమాయ చేశావే' సినిమా సమయంలో ప్రేమలో పడిన ఈ ఇద్దరూ.. అప్పటి నుంచి తమ బంధాన్ని కొనసాగించారు. కొన్నేళ్ల క్రితం ఈ జంట అగ్నిసాక్షిగా ఒక్కటైంది. వివాహం తర్వాత కూడా వీళ్లిద్దరి కెరీర్‌లో ఏమాత్రం మార్పు లేకుండా ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సమంతకు నాగ చైతన్య భారీ షాక్ ఇచ్చాడని ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, మరొకరి ఎంట్రీతో ఆమెను పక్కన పెట్టేస్తున్నాడని అంటున్నారు. ఆ వివరాలు మీకోసం.!

ఇక్కడా.. అక్కడ సత్తా చాటుతోన్న సమంత
‘అఆ', ‘జనతా గ్యారేజ్', ‘రంగస్థలం', ‘మహానటి', ‘యూటర్న్', ‘ఓ బేబీ' వంటి వరుస విజయాలతో దూసుకుపోతోంది స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ తన హవా చూపిస్తోంది. దీంతో ఆమె సౌతిండియాలోనే ఫేమస్ హీరోయిన్‌గా పేరొందుతోంది. అయితే, ఇటీవల ఆమె నటించిన ‘జాను' సినిమా మాత్రం నిరాశకు గురి చేసింది.

సామ్‌తో కలిసిన తర్వాత ఫామ్‌లోకి వచ్చాడు
అక్కినేని నాగార్జున వారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించాడు నాగ చైతన్య. మొదటి నుంచీ అతడి కెరీర్ ఒడిదుడుకుల మధ్యనే సాగుతోంది. అయితే, గత ఏడాది భార్య సమంతతో కలిసి చేసిన ‘మజిలీ'తో అతడు భారీ విజయాన్ని అందుకున్నాడు. దీని తర్వాత విక్టరీ వెంకటేష్‌తో కలిసి చేసిన ‘వెంకీ మామ'తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆ ఫ్యామిలీలోకి సమంత.. చైతూ కొత్త లవ్‌స్టోరీ
సినిమాల్లో సత్తా చాటుతూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సమంత.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ మీడియా రంగంలోకి అడుగు పెడుతోంది. ఇది మినహా ఆమె మరో సినిమాకు సంతకం చేయలేదు. మరోవైపు, నాగ చైతన్య.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ' అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

అక్కినేని ఫ్యామిలీకి దూరంగా సమంత.. చైతన్య
సమంత.. నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీకి దూరం అయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరూ కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించబోతున్నారన్న వార్త కూడా బయటకు వచ్చింది. ఆ సంస్థ ద్వారా కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ఉన్న విషయం తెలిసిందే.

సమంతకు భారీ షాకిచ్చిన నాగ చైతన్య
వివాహాం తర్వాత ఒకరి నిర్ణయాలను ఒకరు గౌరవిస్తూ అన్యోన్యంగా సాగుతున్నారు సమంత, నాగ చైతన్య. ఈ క్రమంలోనే సినీ కెరీర్‌ను సైతం విజయవంతంగా నడిపించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామ్‌కు నాగ చైతన్య ఓ విషయంలో భారీ షాక్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఒకరు ఎంటర్ అవడమే అని అంటున్నారు.
Recommended Video

చైతూ ఫిక్స్.. ఆమెను పక్కన పెట్టేసినట్లే
నాగ చైతన్య తన తదుపరి సినిమాను నందినీ రెడ్డి దర్శకత్వంలో చేసేందుకు సమంత ప్లాన్ చేసిందని ఆ మధ్య ఓ న్యూస్ బయటకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు చైతూ ఆమెను పక్కన పెట్టేశాడని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం అతడు తన తదుపరి సినిమాను విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే అని సమాచారం.


Click it and Unblock the Notifications











