ఇండియన్ 2 డిజాస్టర్ ఎఫెక్ట్: డైరెక్ట్‌గా ఓటీటీలోకి శంకర్ మూవీ?
ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఓటిటిల హవా ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. కాగా గత కరోనా సమయం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఓటిటి వినియోగదారులు భారీగా పెరిగారు. దీనితో ఇది కాస్తా బిగ్ స్క్రీన్స్ పై సినిమాలని రూల్ చేసే విధంగా మారిపోయింది. కాగా అప్పుడు పలు చిత్రాలు వేరే గత్యంతరం లేక డైరెక్ట్ ఓటిటిలో ఇచ్చేసేవారు. కానీ మరికొన్ని చిత్రాలు థియేటర్స్ ఓపెన్ చేసినప్పటికీ ఓటిటిలో విడుదల అయ్యినవి కూడా చాలానే ఉన్నాయి.
మరి వీటిలో హాలీవుడ్ సినిమాలు కూడా లేకపోలేవు. కానీ మన దగ్గర నుంచి మాత్రం ఓ భారీ పాన్ ఇండియా సీక్వెల్ నేరుగా ఓటిటిలో విడుదల అవుతుంది అనే వార్తలు ఊపందుకున్నాయి. రానున్న రోజుల్లో సీక్వెల్ సినిమాలు అంటే కొన్నే కనిపిస్తున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2, ఉలగనయగన్ కమల్ హాసన్ నటించిన భారీ సీక్వెల్ చిత్రం "ఇండియన్ 3" లు ఉన్నాయి.

కాగా వీటిలో ఓ సినిమా రాబోయే మూడు నెలల్లో డైరెక్ట్ గా ఓటిటి రిలీజ్ కి వచ్చేస్తుందట, అయితే ఈపాటికే అర్ధం అయ్యుంటుంది. అది పుష్ప 2 కాదు ఇండియన్ 3 అని. కాగా పుష్ప 2 కి పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషనల్ క్రేజ్ ఉంది. అలాగే ఇండియన్ 3 కి కూడా పర్వాలేదు కానీ పుష్ప 2 రేంజ్ లో లేదు. కాగా దీనికి ముందు వచ్చిన ఇండియన్ 2 భారీ డిజాస్టర్ అయ్యింది కానీ దానికి ఎండింగ్ లో చూపించిన పార్ట్ 3 ట్రైలర్ ఆడియెన్స్ ని ఎగ్జైట్ చేసింది.
కానీ ఎంత ఎగ్జైట్ చేసినా ఏం లాభం, ఈ సినిమాని మేకర్స్ డైరెక్ట్ గా ఓటిటి రిలీజ్ కి ఇచ్చేయాలని చూస్తున్నారట. పార్ట్ 2 తోనే ఆల్రెడీ పెద్ద దెబ్బ తిని ఉన్నారు. అందుకే పార్ట్ 3 విషయంలో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు రిస్క్ తీసుకునే ఆలోచనలో లేరట. అందుకే డైరెక్ట్ గా ఓటిటికి ఇచ్చేయాలని ఫిక్స్ అయినట్టుగా పలు ఊహాగానాలు తమిళ సినీ వర్గాల నుంచి బయటకి వస్తున్నాయి.
ఒకవేళ ఇది నిజం అయితే మాత్రం దర్శకుడు శంకర్ అలాగే కమల్ ల కెరీర్ లోనే అతి పెద్ద డౌన్ ఫాల్ అని చెప్పక తప్పదు. ఇండియన్ సినిమా దగ్గర ఎన్నో భారీ సినిమాలు అందించిన వీరి సినిమా ఇలా నేరుగా ఓటిటి రిలీజ్ రావడం అనేది కొంచెం బాధ కలిగించే విషయమే.. అన్నట్టు ఇంతకీ పార్ట్ 3 ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ ఎపుడు రిలీస్ కి రానుందో కూడా తెలుస్తుంది.
కాగా పార్ట్ 1, 2 లని కూడా స్ట్రీమ్ చేస్తున్న వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ నే పార్ట్ 3 ని కూడా తీసుకునే అవకాశం ఉందని అలాగే నిర్మాతలు కూడా నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఈ చిత్రం ఇంతకీ ఎప్పుడు నుంచి స్ట్రీమింగ్ కి రానుంది అంటే వచ్చే ఏడాది జనవరిలోనే ఓటిటిలో విడుదల కానుందట, బహుశా జనవరి 26 గణతంత్ర దినోత్సవ కానుకగా వచ్చే ఛాన్స్ ఉందని ఇప్పుడు పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇండియన్ 3/ భారతీయుడు 3 సినిమా నిజంగానే ఓటిటిలో వస్తుందో లేదో అనేది ఒక అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











