twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకిస్తున్న బాలకృష్ణ 'లెజండ్' బడ్జెట్

    By Srikanya
    |

    Shocking Budget for Legend Movie
    హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'లెజండ్' . శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం బడ్జెట్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. దాదాపు నలభై కోట్ల వరకూ ఈ చిత్రంపై పెట్టుబడి పెడుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. అయితే వరస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణపై ఈ రేంజి బడ్జెట్ ఎంత వరకూ వర్కవుట్ అవుతుంది అంటున్నారు. 1 నేనొక్కిడినే చిత్రానికి భారీగా ఖర్చు పెట్టిన నిర్మాతలు ఈ సినిమాకి సైతం ఎక్కడా వెనకాడటం లేదని అంటున్నారు. సింహా తర్వాత బోయపాటి శ్రీను,బాలయ్య కాంబినేషన్ కాబట్టి బిజినెస్ పరంగా ఢోకా ఉండదని అంచనాలు వేస్తున్నారు.

    ఇక ఈ చిత్రం ఆడియో ని మార్చి 7 న శిల్పకళా వేదికలో విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ఫిక్స్ అయినట్లు సమాచారం. అలాగే చిత్రం ఫస్ట్ టీజర్ ని కూడా అతి త్వరలో లాంచ్ చేస్తారు. అలాగే మార్చి 28న గానీ, లేదంటే ఏప్రిల్‌ 4న గానీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ప్రస్తుతం దుబాయ్‌లో 'లెజెండ్‌' చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ కీలకమైన యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు.

    ''బాలకృష్ణని ఓ కొత్త తరహాలో చూపిస్తున్నాం. ఆయన మూడు గెటప్పుల్లో కనిపిస్తారు. బాలకృష్ణ పలికే ప్రతి సంభాషణ.. అభిమానుల్ని అలరించేలా ఉంటుంది'' అని దర్శకుడు చెప్తున్నారు. బాలయ్యతో 'సింహా' లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకుడవ్వడం, 'దూకుడు' లాంటి హిట్ తర్వాత నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం... ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి.ఈ చిత్రంలో లో బాలయ్య పాత్రలో రెండు రకాల కోణాలుంటాయని, అత్యంత శక్తిమంతంగా ఆయన పాత్ర ఇందులో ఉంటుందని సమాచారం.

    రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్‌సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తారు.

    పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను. దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని బాలయ్య రాజకీయ భవిష్యత్‌కు ఉపకరించేలా రూపొందిస్తున్నాడట. బాలయ్య అభిమానులను, తెలుగు దేశం పార్టీలను అలరించేలా సినిమాలో డైలాగులు ఉంటాయని, కొన్ని సన్నివేశాలు కూడా బాలయ్య అభిమానుల్లో జోష్ నింపే విధంగా ఉంటాయని చెప్పుకుంటున్నారు.

    ఈ చిత్రంలో బాలకృష్ణ సరికొత్తగా కనిపిస్తారు. ఆయన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన బుల్లెట్ బైక్, సఫారీ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బాలకృష్ణ ఎంతగానో సహకరిస్తున్నారని చిత్ర నిర్మాతలు తెలిపారు. దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ...'ఈచిత్రంపై అభిమానులకు భారీ అంచనాలు ఉండటం సహజం. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గని విధంగా ఈచిత్రం రూపుదిద్దుకుంటోంది' అన్నారు.

    English summary
    Not even considering Balakrishna present form and market value, the producers are spending Rs 40 crore budget on Legend. This Film Will Be Produced By Ram Achanta, Gopi Achanta, & Anil Sunkara Under 14 Reels Entertainment Banner. Radhika Apte (Raktha Charitra Fame) and Sonal Chauhan Will Be Seen in Female Lead Roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X