షాకిస్తున్న సుకుమార్ ప్లాన్.. మహేష్ సినిమాకు బడ్జెట్ ఎంతో తెలుసా!
Recommended Video

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం తరువాత సుకుమార్ దర్శత్వంలో మహేష్ నటించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన కసరత్తు అప్పుడే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. తాజగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

సుకుమార్ దర్శకత్వంలో
గతంలో సుకుమార్, మహేష్ కాంబినేషన్ లో 1 నేనొక్కడినే చిత్రం వచ్చింది. భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం నిరాశపరిచింది. మహేష్ సినిమా విషయంలో అలాంటి పొరపాట్లు తలెత్తకుండా సుకుమార్ ఈ సారి పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు.

భారీ బడ్జెట్
మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఓ కొలిక్కి వచ్చాక సుకుమార్ దర్శకత్వంలో చిత్రం ప్రారంభం కానుంది. ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.ఈ చిత్రాన్ని దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

సుకుమార్ ప్లాన్
ఈ చిత్రాన్ని అత్యుత్తమ టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కించాలనేది సుకుమార్. అందువలనే ఈ చిత్రానికి 150 కోట్ల బడ్జెట్ అవుతుందని నిర్మాతలకు చెప్పడం వాళ్ళు ఓకే చేయడం జరిగిందట.

రంగస్థలం తరువాత
సుకుమార్ రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత తెరకెక్కించబోతున్న చిత్రం ఇది. సుకుమార్ మ్యాజిక్ పనిచేస్తే బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఎలా ఉంటాయో రంగస్థలం చిత్రం నిరూపించింది. మైత్రి మూవీ మేకర్స్ మహేష్, సుకుమార్ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.


Click it and Unblock the Notifications











