వేల సంఖ్యలో మరణాలు.. ఆచార్య నుంచి RRR వరకు టెన్షన్ టెన్షన్.. మహేష్, ప్రభాస్ కూడా

మరోసారి కరోనా దెబ్బకు సినిమా ఇండస్ట్రీపై భారీ ప్రభావం పడేలా ఉందని టాక్ వస్తోంది. గత ఏడాదిలోనే కరోనా వలన పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని తేడా లేకుండా అన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ఇక కొన్ని ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి పెద్ద సినిమాలు వాయిదా పడటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రోజురోజుకు కరోనా తీవ్రత మరింత పెరుగుతోంది. రోజుకు వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

సెకండ్ వేవ్ దెబ్బ

సెకండ్ వేవ్ దెబ్బ

ఈ ఏడాది మొత్తానికి క్రాక్, ఉప్పెన వంటి సినిమాలతో బాక్సాఫీస్ గ్రాండ్ గా మొదలైంది. ఇక జాతిరత్నాలు సినిమా కరెక్ట్ టైమ్ లో వచ్చి మరొక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. వకీల్ సాబ్ కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది. ఈ హిట్స్ తో టాలీవుడ్ ఆల్ మోస్ట్ అంతా సెట్టయ్యిందని అనుకున్న సమయానికి సెకండ్ వేవ్ దెబ్బ కొట్టింది. ఇప్పటికే కొన్ని సినిమాలు అఫీషియల్ వాయిదా పడ్డట్లు క్లారిటీ ఇచ్చాయి.

ఆచార్య.. వాయిదా

ఆచార్య.. వాయిదా

ఇక మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆచార్య సినిమా కూడా ఆల్ మోస్ట్ వాయిదాకు రెడీ అయ్యింది. ఇంకా సినిమాకు సంబంధించిన కొన్ని పనులు పూర్తవ్వాల్సి ఉంది. ఇక మే 14న రిలీజ్ కానున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయానికి సినిమా వచ్చేలా లేదని తెలుస్తోంది.

ప్రభాస్ రాదేశ్యామ్

ప్రభాస్ రాదేశ్యామ్

ఇక రాధే శ్యామ్ జూలై 30న రానున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ అప్పటి వరకు సినిమా పనులు మొత్తం పూర్తయితేనే సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. కరోనా ప్రభావం వలన సలార్ షూటింగ్ ను కూడా వాయిదా వేసుకునే అవకాశం ఉంది.

RRRపై నమ్మకమైతే లేదు

RRRపై నమ్మకమైతే లేదు

ఇక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR విషయంలో ఓ వర్గం వారికి ఇంకా నమ్మకం అయితే లేదు. చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటివరకు రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. అక్టోబర్ 13న రావాలి అంటే షూటింగ్ పనులకు కరోనా ఎంత మాత్రం బ్రేక్ వేయకూడదు.

 KGF 2.. మరోసారి చర్చలు

KGF 2.. మరోసారి చర్చలు

బిగ్గెస్ట్ కన్నడ పాన్ ఇండియా మూవీ KGF 2 పనులన్ని కూడా దాదాపు ఫినిష్ అయ్యాయి. అందుకే దర్శకుడు హ్యాపీగా సలార్ పైనే ఫోకస్ పెట్టాడు. జూలై 16న సినిమాను విడుదల చేయాలని హ్యాపీగా ఉన్న చిత్ర యూనిట్ కరోనా కారణంగా మళ్ళీ విడుదల తేదీపై చర్చలు జరిపే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

పుష్ప.. ఇంకా చాలా ఉంది

పుష్ప.. ఇంకా చాలా ఉంది

ఇక అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రానున్న పుష్ప సినిమా ఆగస్ట్ 13న రానున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ షూటింగ్ పనులు ఇంకా చాలా మిగిలి ఉన్నాయి. ఎంత స్పీడ్ గా చేసినా కూడా జూలై వరకు ఫినిష్ అవ్వడం చాలా కష్టమట. ఇక ఇటీవల కోవిడ్ వలన అల్లు అర్జున్ షూటింగ్ పనులకు బ్రేక్ ఇచ్చేశాడు. చూస్తుంటే ఈ సినిమా వాయిదా పడక తప్పేలా లేదు.

పవన్ , మహేష్ కూడా..

పవన్ , మహేష్ కూడా..

2021 సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ పోటీకి సిద్ధమయ్యారు. సర్కారు వారి పాట, హరిహర వీరమల్లు సినిమాలు ఒకే సీజన్ లో రావడానికి టార్గెట్ సెట్ చేసుకున్నాయి. కానీ కరోనా తాకిడికి సినిమాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి. దీంతో రిలీజ్ డేట్స్ పై ప్రభావం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కరోనా వీలైనంత వరకు తగ్గితేనే ఈ సినిమాలు అభిమానుల ముందుకు అనుకున్న సమయానికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి కాలం ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X