'అందాల రాక్షసి' పబ్లిసిటీపై షాక్ చేసే ఖర్చు

By Srikanya

హైదరాబాద్ : రాజమౌళి తొలిసారి నిర్మాతగా మారి ప్రొడ్యూస్ చేసిన 'అందాల రాక్షసి' మూడు వారాల క్రితం విడుదలైన సంగతి తెలిసిందే. కొత్త దర్సకుడు,కొత్త ఆర్టిస్టులతో రూపొందిన ఈ చిత్రం పై పబ్లిసిటీకి షాకింగ్ అయ్యే రేంజిలో ఖర్చు పెట్టారని ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది. ఈ మద్య కాలంలో ఏ సినిమాకి రానంత ఓపినింగ్స్ రప్పించుకున్న ఈ చిత్రానికి పబ్లిసిటీపై విపరీతంగా ఖర్చుపెట్టడమే కారణం అంటున్నారు. ఇండస్ట్రీలో వినపడేదాన్ని బట్టి ఈ చిత్రానికి కోటి యాభై లక్షల వరకూ పబ్లిసిటీకి ఖర్చు పెట్టారని చెప్తున్నారు. అందులో డబ్బై లక్షలు కేవలం టీవీ ఛానెల్ వారికి యాడ్స్ రూపంలో ఇచ్చారని అంటున్నారు. చిన్న చిత్రానికి ఇది షాకింగ్ పబ్లిసిటీ బడ్జెట్ అంటున్నారు.

ఇక ఈ చిత్రం విడుదల రోజున నెటిటివ్ రివ్యూలతో బ్యాడ్ టాక్ వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అందాల రాక్షసి'. ఈ చిత్రంలో రాజమౌళి షేర్ తీసుకున్నారు. ఆయన ప్రమోషన్ లో కూడా విరివిగా పాల్గొన్నారు. దర్సకుడు మాట్లాడుతూ.. సినిమా ప్రారంభమైన రోజు నుంచి అత్యంత శ్రద్ధతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. అందరూ చాలా నేచురల్‌గా నటించారు. నా నమ్మకమే నాకు శక్తినిచ్చింది. రాజమౌళిగారు, దిల్‌రాజుగారు ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. అందాల రాక్షసి హిట్టవుతుందన్న నమ్మకం మొదటి నుంచీ ఉంది అన్నారు.

ఇక ఈ చిత్రం లాభాల మాట ఏమో కానీ....అందాల రాక్షసి చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన హను రాఘవపూడి తన తదుపరి ప్రాజెక్టుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఆ చిత్రంలో హీరోగా వరస ప్లాఫుల హీరో దగ్గుపాటి రానా నటించే అవకాసం ఉందని తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రం చూసిన రానా వెంటనే ఈ దర్శకుడుతో పనిచేయటానికి ఆసక్తి చూపించినట్లు చెప్తున్నారు. దాంతో రానాని కలిసిన హను ఓ స్టోరీలైన్ చెప్పటం..వెంటనే ఓకే చేయటం జరిగిందని వినికిడి.

అలాగే 'అందాల రాక్షసి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాటి....ఆ సినిమా పెద్దగా విజయం సాధించక పోయినా మంచి అవకాశాలే దక్కించుకుంటోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ భామ ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్లో రూపొందబోయే చిత్రంలో చాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చి రాజమౌళి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ఈచిత్రంలో మెయిన్ హీరోయిన్ గా చేయనుంది. సోసియో ఫాంటసీ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త గెటప్ తో కనిపించనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X