RC 15: రిలీజ్ డేట్ పై మరో కన్ఫ్యూజన్.. శంకర్ హ్యాండ్ ఇవ్వడంతో ప్లాన్ చేంజ్!
RRR సినిమాతో బాక్సాఫీస్ వద్ద మొత్తానికి ఇద్దరు హీరోలు కూడా వారికంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటున్నారు అనే చెప్పాలి. ఈ సినిమాకు రాజమౌళి బ్రాండ్ గట్టిగానే ఉపయోగపడినప్పటికీ కూడా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇద్దరు కూడా అద్భుతంగా నటించారు అంటూ బాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా నార్త్ ఆడియన్స్ కూడా ఇద్దరు హీరోలకు నటనకు ఫిదా అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన అనేక రకాల అంశాలు వైరల్ గా మారుతున్నాయి అందులో ఎక్కువగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంది అంటూ కొనియాడుతున్నారు. అయితే ఈ క్రమంలో RRR తో సంపాధించిన క్రేజ్ ను ఇద్దరు హీరోలు కూడా వారి తదుపరి సినిమాలతో అదే తరహాలో మార్కెట్ ను కంటిన్యూ చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.
జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ రామ్ చరణ్ ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో తన సినిమాను మొదలుపెట్టిన విషయం. తెలిసిందే ఆ సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయింది. వీలైనంత త్వరగా పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు అని అందరూ అనుకున్నారు. ఇక చిత్ర యూనిట్ ముందుగా ఇంటిమేట్ చేసిన సమాచారం బట్టి RC 15వ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అర్థమైంది. దిల్ రాజు కూడా అందుకు తగ్గట్టుగా శంకర్ కు ముందుగానే సూచనలు కూడా ఇచ్చినట్లు సమాచారం.

ఒక విధంగా దర్శకుడు శంకర్ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ అనుకోని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే జనవరి సమయానికి ఈ సినిమా విడుదలకు సిద్ధం కాదట. అటుఇటుగా సినిమా మరో రెండు నెలలు ఆలస్యం అవుతుంది అనే టాక్ వినిపిస్తోంది. ఇక నిర్మాత దిల్ రాజు సినిమా విడుదల విషయంలో ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా సంక్రాంతికి ఏదైనా పెద్ద సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దిల్ రాజు ముందు నుంచి ఒక నిర్ణయం తో ఉన్నాడు. ఇక శంకర్ రామ్ చరణ్ సినిమా ఆ సమయానికి సిద్ధం కాదు అని క్లారిటీ రావడంతో విజయ్ తో ప్రస్తుతం చేస్తున్న సినిమా అదే సమయానికి తీసుకురావచ్చు అని తెలుస్తోంది.
ఇక రామ్ చరణ్ సినిమాను సమ్మర్లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దిల్ రాజు ఇటీవల విజయ్ తో సినిమాను నిర్మించబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. ఇక సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ మ్యూజిక్ అంధించనున్నాడు. మొత్తానికి అయితే రామ్ చరణ్ సినిమా అయితే సంక్రాంతి రాదని టాక్ వస్తోంది. మరి సంక్రాంతికి రాబోయే విజయ్ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవిజేతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











