ప్రభాస్‌తో మెగాస్టార్.. ఆ ఒక్క ఫొటోతో ఎన్నో అనుమానాలు.. అదే నిజమైతే పూనకాలే..

టాలీవుడ్ లోనే కాకుండా నేషనల్ వైడ్ గా నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న ఏకైక హీరో ప్రభాస్. బహుబలి నుంచి ప్రభాస్ రేంజ్ ఏ స్థాయికి వెళుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతోంది. ఇక రెబల్ స్టార్, మెగాస్టార్ తో ఉన్న ఫొటో ఈ మధ్య బాగా వైరల్ అవుతోంది. అలాగే దాని చుట్టూ ఒక రూమర్ గా ట్రెండ్ అవుతోంది.

ఆ సినిమా హిట్టయ్యి ఉంటే..

ఆ సినిమా హిట్టయ్యి ఉంటే..

ప్రభాస్ బాహుబలి అనంతరం మళ్ళీ ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. సాహో అనుకున్నంతగా హిట్ అవ్వకపోయినప్పటికి డార్లింగ్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదని ఓపెనింగ్స్ తోనే క్లారిటీ వచ్చేసింది. ఆ సినిమా హిట్టయ్యి ఉంటే ప్రభాస్ రేంజ్ మరోలా ఉండేది. ఇక నెక్స్ట్ రాధేశ్యామ్ తో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

మరో నాలుగేళ్ళ వరకు బిజీగా

మరో నాలుగేళ్ళ వరకు బిజీగా

ప్రభాస్ లైనప్ ఇప్పుడు మామూలుగా లేదు. గ్యాప్ లేకుండా మరో నాలుగేళ్ళ వరకు బిజీగా ఉండేలా సినిమాలను సెట్ చేసుకుంటున్నాడు. రాధేశ్యామ్ ను వీలైనంత త్వరగా రిలీజ్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో సలార్ ను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు. అయితే ఆ సినిమాకు సంబంధించిన ఒక రూమర్ వైరల్ గా మారింది.

 మెగాస్టార్ గాడ్ ఫాదర్ పాత్రలో..?

మెగాస్టార్ గాడ్ ఫాదర్ పాత్రలో..?

KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతోంది. అయితే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవిని సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. సినిమాలో మెగాస్టార్ గాడ్ ఫాదర్ పాత్రలో కనిపించవచ్చని ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు.

 ఆ ఫొటో ఇప్పటిది కాదు

ఆ ఫొటో ఇప్పటిది కాదు

ప్రస్తుతం ఒక ఫొటో అయితే సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవిని ప్రభాస్ ఆప్యాయంగా పట్టుకున్నట్లు ఉండడంతో ఆ ఫొటో అభిమానులకు కనువిందుని కలోగిస్తోంది. అయితే ఈ పోటో ఇప్పటిది కాదు. ఒకసారి ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ సెలబ్రెటీలకు పార్టీ ఇచ్చినప్పటిది. ఆ పార్టీలో ఇలా సరదాగా మాట్లాడుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ కాంబోలో మూవీ రానున్నట్లు గాసిప్స్ వైరల్ అవుతుండడంతో ఆ ఫొటో కూడా వైరల్ అవుతోంది. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజుకు వేయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X