షాకింగ్ అప్‌డేట్: ‘ఆచార్య’లో హీరో చిరంజీవి కాదు.. అందుకే టైటిల్ అలా పెట్టారు
మెగాస్టార్ చిరంజీవి... తెలుగు తెరపై తిరుగులేని హీరోలలో ఒకరు. ఎవరి అండా లేకపోయినా సినిమాల్లోకి ప్రవేశించిన ఆయన.. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి బడా హీరోల హవా నడుస్తున్న సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయారు. ఆ తర్వాత చాలా కాలం పాటు టాప్ హీరోగా వెలుగొందిన ఆయన.. కొన్నేళ్ల క్రితం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'ఆచార్య' అనే మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే....

గ్రాండ్ కమ్‌బ్యాక్.. అంతలోనే అలా జరిగింది
చాలా కాలం పాటు సినిమాల్లో తన హవా చూపించిన మెగాస్టార్ చిరంజీవి... కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లోకి వెళ్లారు. అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో... మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆయన కమ్‌బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150' సూపర్ హిట్ అవడంతో పాటు ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘సైరా: నరసింహారెడ్డి' మాత్రం నిరాశ పరిచింది.

బడా డైరెక్టర్‌తో చిరంజీవి.. బద్దలు కొడతారా.?
‘సైరా' తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. మ్యాట్నీ మూవీస్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి ‘ఆచార్య' అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

మరో మెసేజ్ రెడీ.. ఈ సారి సరికొత్త పాయింట్
తన ప్రతి చిత్రానికీ ఏదో ఒక మెసేజ్ ఇస్తుంటాడు డైరెక్టర్ కొరటాల శివ. ఈ నేపథ్యంలోనే చిరంజీవితో చేస్తున్న సినిమా కూడా సందేశాత్మకంగానే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సారి దేవాదాయ భూముల ఆక్రమణలపై ఆయన ఫోకస్ చేశారని తెలుస్తోంది. అంతేకాదు, ఇందులో మెగాస్టార్.. నక్సలైట్ పాత్రను పోషిస్తున్నారని ఇటీవల లీకైన ఫొటోను బట్టి తెలిసింది.

చిరంజీవి సినిమాలో చరణ్, మహేశ్ కీ రోల్
‘సైరా' సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కొరటాల శివ ప్రాజెక్టు ఓకే అయింది. అప్పుడే ఈ మూవీలో చిరుతో పాటు చరణ్ కూడా నటిస్తాడని ప్రచారం జరిగింది. దీంతో ఇది మల్టీస్టారర్ మూవీ అనుకున్నారు. ఆ తర్వాత ఈ వార్తలకు పుల్‌స్టాప్ పడింది. కానీ, ఇటీవల ఇందులో మహేశ్ నటిస్తున్నాడని అన్నారు. ఇప్పుడేమో చరణే ఓ పాత్ర చేస్తున్నాడని క్లారిటీ ఇచ్చారు.

షాకింగ్: ఆచార్య మూవీలో హీరో చిరు కాదు
కొద్ది రోజులుగా ఆచార్య మూవీ గురించి కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ షాకింగ్ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం... ఈ మూవీలో చిరంజీవి కంటే బలమైన.. అత్యంత ముఖ్యమైన పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడట. అతడు చూపిన బాటలోనే నడిచే పాత్ర చిరుది అని సమాచారం. పాత్ర తక్కువ సేపు ఉన్నా ప్రాధాన్యం ఉంటుందని టాక్.
Recommended Video

ఆ హీరో వల్లే సినిమాకు టైటిల్ అలా పెట్టారు
ఇందులో రామ్ చరణ్ నక్సలైట్ పాత్రను చేస్తున్నాడని.. ఓ మిషన్‌లో భాగంగా అతడు చనిపోతే.. చిరంజీవి దాన్ని కొనసాగిస్తాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. చిరుకు దిశానిర్దేశం చేసే పాత్రలో చెర్రీ కనిపిస్తాడట. అందుకే ఈ సినిమాకు గురువు అర్థం వచ్చేలా ‘ఆచార్య' అనే టైటిల్ ఫిక్స్ చేశారని ఓ న్యూస్ బయటకు వచ్చింది.


Click it and Unblock the Notifications











