twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు మాస్టర్ ప్లాన్ కి అంతా షాక్

    By Sindhu
    |

    దూకుడు సినిమా ఇంకా ఒక పాట షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా,దానిని పూర్తి చేయటం మానేసి మహేష్ హడావిడిగా బిజినెస్ మ్యాన్ చిత్రం షూటింగ్ ప్రారంభించటం అందరినీ ఆశ్చర్యపరచింది. అంతా ఏంటి అని ఆలోచనలో పడ్డారు. అయితే దీని వెనక ఉన్న మాస్టర్ ప్లాన్ నెమ్మిదిగా బయిటకు వచ్చింది. సినీ కార్మికుల సమ్మె కారణంగా సెప్టెంబర్ ఏడు నుంచి కొత్త సినిమాలు మొదలు కావటానికి వీలులేదు. ఈ నిర్ణయం హటాత్తుగా తీసుకుంది కాదు. గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీ పెద్దల మధ్య నలుగుతున్నదే. దాంతో దూకుడు పాటను పెండింగ్ పెట్టి అర్జెంటుగా మెదలెట్టేసారు. ఇప్పుడు అక్టోబర్ 31 నాటికి విదేశాలకి వెళ్ళిపోవచ్చు. బ్యాలెన్స్ పార్ట్ అంతా షూటింగ్ పూర్తి చేసుకుని సమ్మె తర్వాత ఇక్కడకి తిరిగి రావచ్చు. అలా సమ్మె ఎఫెక్టు నుంచి తప్పించుకోవటానకి మహేష్ బాబు వేసిన మాస్టర్ ప్లాన్ ఇది అంతా చెప్పుకుంటున్నారు. ఇది విన్న సీనియర్స్ మహేష్ ఆలోచన చూసి షాక్ అయ్య నోటి మీద వేలు వేసుకుంటున్నారు. 'బిజినెస్‌మ్యాన్‌'గా టైటిల్‌కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్‌ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఆయన రూపొందించబోయే చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. రీసెంట్ గానే ఈ చిత్రం ఓపినింగ్ జరిగింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Businessman is the first movie with kajal and Mahesh babu are teaming up for. Movie will start its regular shooting from September 1st and the major part will be shot in Mumbai. Makers already announced the release date for this movie as sankranthi release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X