షాక్: RRRకి మరో బ్రేక్.. అడ్డొచ్చిన బాహుబలి.. అనుకోని కష్టం! హాట్ టాపిక్

బాహుబలి సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా RRR సినిమా రూపొందిస్తున్నారు రాజమౌళి. చాలా గ్యాప్ తర్వాత జక్కన్న సినిమా తెరకెక్కిస్తుండటం, ఇద్దరు స్టార్ హీరోలు ఈ సినిమాలో నటిస్తుండటం కారణంగా ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. అందరి అంచనాలను రీచ్ అయ్యేలా ఈ సినిమాకు అన్నీతానై ముందుకెళ్తున్నారు రాజమౌళి. అయితే అనుకోని అంతరాయం రావడంతో రాజమౌళి ఓ వారం పాటు సైడ్ కావడం హాట్ టాపిక్ అవుతోంది.

షూటింగ్ మొదలైనప్పటి నుంచే అడ్డంకులు

షూటింగ్ మొదలైనప్పటి నుంచే అడ్డంకులు

RRR సినిమా షూటింగ్ ప్రారంభించిన రాజమౌళి, ఈ సినిమాను జులై 30, 2020 సంవత్సరంలో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు జక్కన్న. కానీ షూటింగ్ మొదలైనప్పటి నుంచే ఈ సినిమాకు అడ్డంకులు ఎదురవుతుండటం చర్చనీయాంశంగా మారింది.

ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఒకరి తర్వాత మరొకరు

ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఒకరి తర్వాత మరొకరు

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ సినిమాగా RRR రూపొందిస్తున్నారు రాజమౌళి. అయితే అనుకోని కారణాలు, వెంటాడిన గాయాల కారణంగా ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఒకరి తర్వాత మరొకరు ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వడంతో షెడ్యూల్స్ ఆలస్యమవుతూ వచ్చాయి.

ఫ్రీ అయ్యారుగా.. ఇకనైనా అనుకునే లోపే!

ఫ్రీ అయ్యారుగా.. ఇకనైనా అనుకునే లోపే!

ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ తమ పనుల నుంచి ఫ్రీ అయ్యారుగా అనుకునే లోపే మరో ఊహించని అడ్డు రావడం మెగా, నందమూరి అభిమానులకు షాకిచ్చింది. ఈ సారి రాజమౌళి బ్రేక్ తీసుకోవడం, పైగా దీనికి ఆయన గత సినిమా బాహుబలి కారణం కావడం పలు చర్చలకు దారితీసింది.

లండన్‌లో బాహుబలి.. జక్కన్న పయనం

లండన్‌లో బాహుబలి.. జక్కన్న పయనం

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన బాహుబలి సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. లండన్ లోని సుప్రసిద్ధ రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా టీమ్.. బాహుబలి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను లైవ్ ఆర్కెస్ట్రాతో వినిపించనున్నారు. అక్టోబర్ 19న జరగనున్న ఈ కార్యక్రమానికి రాజమౌళి సహా కీరవాణి అండ్ టీమ్ పయనమయ్యారు.

వారం బ్రేక్.. కష్టమేనా?

వారం బ్రేక్.. కష్టమేనా?

దీంతో RRR సినిమా షూటింగ్‌కి వారం రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు మేకర్స్. లండన్ నుంచి రాజమౌళి తిరిగొచ్చాక మళ్ళీ రెగ్యులర్ షూట్ ప్రారంభిస్తారు. ఇదంతా చూసి.. ఇలా అనేక కారణాలతో షూటింగ్ వాయిదా పడుతుంటే ఇక సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టమే అంటున్నారు. ఈ విషయమై ఫిలింనగర్ సర్కిల్స్‌లో తెగ చర్చ నడుస్తోంది.

తెలుగుతో పాటు పలు భాషలు.. భారీ అంచనాలు

తెలుగుతో పాటు పలు భాషలు.. భారీ అంచనాలు

తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా భారీగా విడుదల కానుంది RRR మూవీ. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. చిత్రంలో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X