షాకింగ్ న్యూస్.. సావిత్రి బయోపిక్‌లో ఆ విషాదం ఉండదట..
వెండితెరపై చెరగని ముద్ర వేసుకొన్న అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా సావిత్రి బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత అక్కినేని, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి పేరుతో సావిత్రి బయోపిక్ తెరకెక్కుతున్న చిత్రం మే 9న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. అదేమిటంటే..

సావిత్రి తన చివరి రోజుల్లో దయనీయమైన స్థితిని అనుభవించింది. సావిత్రి తన ఆస్థులని కోల్పోయి, మద్యానికి బాగా అలవాటై తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్నారు. తన పేరిట ఉన్న చాలా ఆస్థులు సీజ్ కాబడ్డాయి. ఇలాంటి విషాద సంఘటనలను నిర్మాతలు సావిత్రి బయోపిక్‌లో సినిమాలో చూపించదలచుకోలేదట. సావిత్రి కుటుంబ సభ్యులు ఆమె విషాదగాథను చూపించవద్దని కోరిన నేపథ్యంలో నిర్మాతలు అందుకు అంగీకరించినట్టు సమాచారం. మిక్కీ జేయర్ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తమిళంలో 'నడిగర్ తిలగమ్' అనే టైటిల్ తో ఈ మూవీ విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











