For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పాన్ ఇండియా దర్శకుడితో మళ్ళీ రామ్ చరణ్, అల్లు అర్జున్.. అసలు నిజం ఏమిటంటే?

  |

  సినిమా ఇండస్ట్రీలో గత ఐదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. కేవలం బిగ్ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినిమాలు కూడా వరుసగా రూపొందుతున్నాయి. వాటికి తోడు మల్టీస్టారర్ కథలు కూడా ఎక్కువగానే రాబోతున్నాయనే చెప్పాలి. ప్రస్తుతం అందరి చూపు అయితే RRR పైనే ఉంది. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత కూడా మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు తెరపైకి వస్తాయి అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ రామ్ చరణ్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమాను తెరకెక్కించడానికి చర్చలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఇక ఈ విషయంపై ఆరా తీయగా అసలు నిజం ఏమిటో తెలిసిపోయింది

   మెగాస్టార్ చిరంజీవి - నందమూరి బాలకృష్ణ

  మెగాస్టార్ చిరంజీవి - నందమూరి బాలకృష్ణ


  దాదాపు అందరి హీరోల అభిమానులకు వారి హీరోలు మల్టీ స్టారర్ సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటారు. ముఖ్యంగా బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి కలయికలో సినిమా వస్తే బాక్సాఫీస్ రికార్డులు అప్పట్లోనే బ్లాస్ట్ అయ్యేవని చెప్పవచ్చు. కానీ ఆ కాంబోలో సినిమా రాలేదు. ఇక ఈసారి వారి వారసులు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ మొదటి సారి కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ లెక్కలు కూడా ఒక్కసారిగా మారిపోతాయని చెప్పవచ్చు.

  RRR తరువాత మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు

  RRR తరువాత మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు

  RRR సినిమాతో దర్శకుడు రాజమౌళి ఒక సరి కొత్త ట్రెండ్ సెట్ చేస్తాడని చెప్పవచ్చు. స్టార్ హీరోలతో యాక్షన్ మల్టీస్టారర్ సినిమాలు చేయడం రిస్కుతో కూడుకున్న పని అని చాలామంది దర్శకులు కామెంట్ చేశారు. కానీ సరైన కథ సెట్టయితే మాత్రం ఇద్దరికి న్యాయం చేయవచ్చని చూపించబోతున్నాడు. RRR అనంతరం టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు పుట్టుకొస్తాయని చెప్పవచ్చు. అప్పటికే అగ్ర హీరోలు మల్టీస్టారర్ చిత్రాలపై ఎక్కువ గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అర్థమవుతోంది. కథ నచ్చితే వెంటనే ఒప్పేసుకుంటున్నారు.

   బన్నీ సిద్ధమే..

  బన్నీ సిద్ధమే..

  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త అయితే అభిమానులను ఎంతగానో ఊరిస్తోంది. రామ్ చరణ్ తేజ్ అల్లు అర్జున్ ఒక ఫుల్ యాక్షన్ మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నారు అనే కథనాలు వెలువడుతున్నాయి. ఇదివరకే ఈ ఇద్దరు కూడా ఎవడు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. కానీ అందులో అల్లు అర్జున్ కేవలం ఒక చిన్న పాత్రలో కనిపించాడు. మళ్లీ ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా మల్టీస్టారర్ సినిమాల ఆఫర్స్ వచ్చినా కూడా చేయలేదని రూమర్స్ వచ్చాయి. కానీ కథ నచ్చితే బన్నీ ఎలాంటి సినిమాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటానని రుద్రమదేవి సినిమాతోనే క్లారిటీ ఇచ్చేశాడు.

  Chiru బృందంలో Mahesh Babu, Allu Arjun | Ys Jagan ఒకే అంటేనే || Filmibeat Telugu
  అది నిజం కాదు.. కానీ అతనితో పక్కా..

  అది నిజం కాదు.. కానీ అతనితో పక్కా..

  ఇక ఈ కాంబినేషన్ ను సెట్ చేయబోయే దర్శకుడు మరెవరో కాదు. దర్శకధీరుడు రాజమౌళి అని మరికొన్ని స్టోరీలు వదిలేస్తున్నారు. ఇదే విషయంపై ఆరా తీయగా.. ప్రస్తుతం రాజమౌళి అయితే RRR సినిమా విడుదల విషయంపైనే ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు తో చేయాల్సిన ప్రాజెక్టు యొక్క కథ కూడా ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు. రిలీజ్ అయ్యే వరకు కూడా ఆ సినిమాపై ఫోకస్ పెట్టె అవకాశం అయితే లేదు. కాబట్టి అల్లు అర్జున్ రామ్ చరణ్ మల్టీస్టారర్ సినిమాకు కమిట్ అయినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం అయితే లేదు. అయితే అల్లు అర్జున్ తో మాత్రం రాజమౌళి ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మరి ఆ ప్రాజెక్టు ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.

  English summary
  Shocking news on allu arjun ram charan tej multi starrer project behind the truth,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X