గీతగోవిందం ఎఫెక్ట్.. బడా నిర్మాతల నుంచి పరశురామ్ అడ్వాన్స్ లు.. లైన్ లో ఎంతమందో తెలుసా?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు దర్శకులకు డిమాండ్ అయితే గట్టిగానే పెరిగింది. ఒక్క సక్సెస్ అందుకున్నా కూడా నిర్మాతలు వారి వెంటపడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో అత్యధిక స్థాయిలో ఆఫర్స్ అందుకున్న దర్శకులను పరుశురామ్ కూడా ఉన్నాడు. ఒకే ఒక్క సినిమాతో అతని రేంజ్ మారిపోయింది. అయితే పరుశురామ్ గీత గోవిందం సినిమా తర్వాత చాలామంది నిర్మాతలు నుంచి అడ్వాన్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన లిస్టు కూడా వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

పూరి శిష్యుడిగా..
పరశురామ్ పూరి జగన్నాధ శిష్యుడు మాత్రమే కాదు అతని దగ్గర బంధువు కూడా. ఇక మొదట నిఖిల్ తో అతను చేసిన యువత సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న తర్వాత 2009లో రవితేజతో ఆంజనేయులు అనే సినిమా తీశాడు. కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు కానీ నారా రోహిత్ తో చేసిన సోలో సినిమా మాత్రం దర్శకుడిగా అతనికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది.

గీతగోవిందంతో లైఫ్ సెట్!
ఇక ఆ తర్వాత సారొచ్చారు.., శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో కూడా పరవాలేదు అనిపించిన పరుశురాం ఫైనల్ గా 2019లో మాత్రం గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్ వద్ద అసలైన సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమాకు లాభాల్లో వాటా అందుకున్నాడు. దీంతో అతను ఉన్న ఆర్థిక సమస్యలు తీర్చుకోవడమే కాకుండా హైదరాబాదులోనే ఒక మంచి ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఆ విధంగా అతనికి ఆ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది.

నెక్స్ట్ విజయ్ సినిమా..
అయితే పరుశురామ్, మహేష్ బాబుతో గత ఏడాది తెరపైకి తీసుకు వచ్చిన సర్కారు వారి పాట మాత్రం అంతగా సక్సెస్ కాలేదు. ఇక మళ్ళీ అతను తదుపరి సినిమాను కూడా వీలైనంత త్వరగా మొదలుపెట్టాలి అని చూస్తున్నాడు. ఇటీవల విజయ్ దేవరకొండ తో దిల్ రాజు ప్రొడక్షన్లో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అల్లు అరవింద్ సీరియస్?
అయితే విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసిన కొద్దిసేపటికి ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఈ పరశురాం పై వివిధ రకాల కథనాలు వెలువడ్డాయి. ఈ దర్శకుడు ఇదివరకే గీత ఆర్ట్స్ లో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు టాక్ వచ్చింది. అంతేకాకుండా అది కూడా విజయ్ దేవరకొండతో గీతగోవిందం సీక్వెల్ అని కూడా కథనాలు వెలువడ్డాయి. కానీ పరశురాం మాత్రం ఊహించని విధంగా దిల్ రాజు దగ్గరకు వెళ్లడంతో అల్లు అరవింద్ సీరియస్ అయినట్లుగా ఒక టాక్ వినిపించింది. ఎందుకంటే విజయ్, పరశురామ్ కాంబినేషన్లో మరో సినిమా చేయాలని అల్లు అరవింద్ ముందే కమిట్మెంట్ తీసుకున్నాడు.

కూల్ చేసిన దిల్ రాజు?
పరుశురాం కేవలం దిల్ రాజు అల్లుఅరవింద్ కు మాత్రమే కాకుండా చాలామంది నిర్మాతరం నుంచి కూడా అడ్వాన్సులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన కథనాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు అరవింద్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ కూడా పెట్టాలని ఇటీవల డిసైడ్ అయినట్లు ఒక వార్త వచ్చిన విషయం తెలిసిందే మళ్ళీ దిల్ రాజు మాట్లాడి వివాదం పెద్దది కాకుండా మాట్లాడినట్లు తెలుస్తోంది.

వాళ్ళ నుంచి కూడా అడ్వాన్స్ లు?
ఇక పరశురామ్ లిస్ట్ లో అయితే దాదాపు పది ప్రొడక్షన్ హౌస్ లు అడ్వాన్స్ లు ఇచ్చినట్లు సమాచారం. అందులో దిల్ రాజు గీత ఆర్ట్స్ తో పాటు 14 రీల్స్ ప్లస్ అలాగే సురేష్ బాబు ప్రొడక్షన్, మంచి విష్ణు ప్రొడక్షన్స్, ఐ డ్రీమ్ వాళ్లతో కూడా ఒక సినిమా చేయాలి కమిట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లిస్టులో బీవిఎస్ఎన్ ప్రసాద్, ఫాల్కన్ ప్రొడక్షన్లు కూడా ఈ దర్శకుడికి అడ్వాన్సులు ఇచ్చినట్లు సమాచారం. మరి వీటికి దర్శకుడు ఎప్పుడు ప్రాజెక్టులను సెట్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











