ప్రభాస్ తో సినిమా చేయడానికి చిన్న హీరోయిన్ ప్రయత్నం.. ఛాన్స్ వస్తే దశ తిరిగినట్లే..

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక్క చాన్స్ వచ్చిన చాలని చాలామంది హీరోయిన్స్ ప్రయత్నం చేస్తున్నారు. ప్రభాస్ సినిమా అంటే చాలు కథ కూడా వినకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కూడా రెడీ అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో చాలా పవర్ఫుల్ సినిమాలు ఉన్నాయి. ఇక అందులో కొన్ని సినిమాలకు హీరోయిన్స్ కూడా ఫైనల్ కావాల్సి ఉంది. ఇక ప్రభాస్ సినిమాలో నటించేందుకు కొంతమంది హీరోయిన్స్ దర్శకులను నిర్మాతలతో కూడా టచ్ లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. చాలా వరకు ప్రభాస్ నటీనటుల విషయంలో తన నిర్ణయాన్ని పెద్దగా పట్టించుకోడు. పూర్తిగా దర్శక నిర్మాతలే ప్రభాస్ సినిమాలకు హీరోయిన్స్ ఫైనల్ చేస్తుంటారు.

ఇక ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాను విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సినిమాను మార్చి 13న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. అయితే ఆ సినిమా అనంతరం సలార్ సినిమాతో రానున్న ప్రభాస్, అనంతరం ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె సినిమాలతో రానున్నాడు. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

Shocking news on Prabhas maruti project heroine

ఇక మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి ప్రభాస్ చర్చలు జరుపుతున్నట్లు మరొక టాక్ వస్తోంది. ఇంకా ఈ కాంబినేషన్ పై అఫీషియల్ గా క్లారిటీ అయితే రాలేదు. ప్రస్తుతం టైటిల్ అయితే రాజా డీలక్స్ అని సెట్ చేసినట్లుగా టాక్ వస్తోంది. ఇక ఇదొక హారర్ కామెడీ ఫిలిమ్ అని కూడా అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా అవకాశం అందుకోవడానికి మెహ్రీన్ పిర్జాదా ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మెహ్రీన్ ఇదివరకే మారుతి దర్శకత్వంలో మహానుభావుడు, మంచి రోజులొచ్చాయి వంటి సినిమాల్లో నటించింది. రెమ్యునరేషన్ ను పెద్దగా పట్టించుకోకుండా ఈ బ్యూటీ మంచి సినిమాలు చేసేందుకే ప్రయత్నం చేస్తోందట. ఇక ప్రభాస్ సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ అందుకునెందుకు మారుతీతో మరోసారి చర్చలు మొదలు పెట్టినట్ల తెలుస్తోంది. కానీ మారుతి ఇంకా ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట.

ప్రభాస్ అయితే మారుతి చెప్పిన కథపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు సమాచారం. ఇక సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా చాలా కీలకం కానున్నట్లు తెలుస్తోంది. మరి మారుతి ఎవరిని ఫైనల్ చేస్తాడో చూడాలి. ఇక మారుతి ఈ సినిమా కథను మొదట రవితేజకి చెప్పాడట. కానీ ఆ హీరో బిజీగా ఉండడంతో ప్రభాస్ కు తగ్గట్టుగా అతని బాడీ లాంగ్వేజ్ కు సెట్టయ్యే విధంగా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. యూవీ క్రియేషన్స్ లో నిర్మియించబోయే ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X